ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: డుప్లెసిస్, రబాడ ఢీ.. కిందపడి విలవిల్లాడిన చెన్నై ఓపెనర్

డుప్లెసిస్ వేగంగా దూసుకొస్తున్న సమయంలో అనుకోకుండా అడ్డం వెళ్లడంతో.. ఇద్దరు గుద్దుకున్నారు. బలంగా ఢీకొట్టుకోవడం వల్ల డుప్లెసిస్, రబడా ఇద్దరూ కింద పడిపోయారు. డుప్లెసిస్ అలాగే కిందకు వంగి నొప్పితో విలవిల్లాడు.

news18-telugu
Updated: October 17, 2020, 9:01 PM IST
IPL 2020: డుప్లెసిస్, రబాడ ఢీ.. కిందపడి విలవిల్లాడిన చెన్నై ఓపెనర్
డుప్లెసిస్, రబాడ ఢీ
  • Share this:
IPL 2020: గ్రౌండ్‌లో ఆటగాళ్లు ఢీకొట్టుకోవడం సర్వ సాధారణమే..! పిచ్‌లో బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు పరస్పరం ఢీకొన్న ఘటనలు చాలానే ఉన్నాయి. అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. చాలా అరుదుగా మాత్రమే ఉద్దేశపూర్వకంగా జరుగుతుంటాయి. షార్జాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చెన్నై బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఢిల్లీ బౌలర్ రబడా పరస్పరం గుద్దుకున్నారు. అనంతరం కింద పడిపోయారు. రన్నింగ్ చేస్తూ రబాడాను బలంగా తాకడంతో ఫాఫ్ డుప్లెసిస్ కొంత సమయం పాటు ఇబ్బంది పడ్డాడు. ఐతే ఇది కూడా అనుకోకుండానే చోటుచేసుకుంది. ఈ వీడియోను ఇండియన్ ప్రీమియర్ అధికారిక వెబ్‌సైట్లో పోస్ట్ చేశారు.

రబాడ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి డుప్లిసిస్ సింగిల్ తీశాడు. బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తోందని గ్రహించిన డుప్లెసిస్.. వేగంగా పరుగు తీసేందుకు ప్రయత్నిచాడు. అదే సమయంలో రబాడ బంతిని చూస్తూ.. వెనక నుంచి వస్తున్న డుప్లెసిస్‌ను గమనించలేదు. డుప్లెసిస్ వేగంగా దూసుకొస్తున్న సమయంలో అనుకోకుండా అడ్డం వెళ్లడంతో.. ఇద్దరు గుద్దుకున్నారు. బలంగా ఢీకొట్టుకోవడం వల్ల డుప్లెసిస్, రబడా ఇద్దరూ కింద పడిపోయారు. డుప్లెసిస్ అలాగే కిందకు వంగి నొప్పితో విలవిల్లాడు. వెంటనే రబాడా వచ్చి.. వెనక నుంచి అతడిని పట్టుకొని.. అంతా ఓకేనా అని అడిగాడు. పర్లేదు అని చెప్పాడు డుప్లెసిస్. అనంతరం పైకి లేచి.. రబాడ వైపు ఒక చూపు చూశాడు. ఐతే తాను చూసుకోలేదని నవ్వుతూ చెప్పాడు రబాడ.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అయ్యో జాగ్రత్త అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, రబాడ, డుప్లెసిస్ దక్షిణాఫ్రికా టీమ్‌కు చెందిన వారే కావడంతో..ఇద్దరూ సరదాగానే తీసుకున్నారు. నవ్వుతూనే మాట్లాడారు.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2020, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading