హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020: పంజాబ్‌ను అస్సాం ట్రైన్ ఎక్కించిన చెన్నై.. ఫన్నీమీమ్స్.. నవ్వాగదు

IPL 2020: పంజాబ్‌ను అస్సాం ట్రైన్ ఎక్కించిన చెన్నై.. ఫన్నీమీమ్స్.. నవ్వాగదు

సోషల్ మీడియాలో మీమ్స్ (Image:Twitter)

సోషల్ మీడియాలో మీమ్స్ (Image:Twitter)

ఇవాళ్టి మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. చెన్నై జట్టు దగ్గరుండి మరీ పంజాబ్‌ను అస్సాం ట్రైన్‌ను ఎక్కించిందని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.

IPL 2020: ఐపీఎల్ 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది. వెళ్తూ..వెళ్తూ.. కింగ్స్ ఎలెవన్ జట్టును కూడా పట్టుకెళ్లింది. ఇవాళ్టి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ రేసులో నిలిచి ఉండే వారు. కానీ బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విఫలమై.. టోర్నీ నుంచి బయటకొచ్చింది. అటు చెన్నై జట్టు మాత్రం వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ.. పక్క జట్ల ప్లేఆఫ్స్ ఆశలను గండికొడుతోంది. టోర్నీ మధ్యలో అట్టర్ ఫ్లాపైన సీఎస్‌కే చివరిలో మాత్రం అదరగొట్టింది. యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేయడంతో.. ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తద్వారా కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా పంజాబ్ జట్టును తమతో పాటు ఇంటికి తీసుకెళ్లింది చెన్నై.

ఇవాళ్టి మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. చెన్నై జట్టు దగ్గరుండి మరీ పంజాబ్‌ను అస్సాం ట్రైన్‌ను ఎక్కించిందని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వాళ్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదు.. పక్క జట్లను వెళ్లనీయడం లేదని.. ధోనీ సేనపై కామెడీ పోస్ట్‌లు పెడుతున్నారు. వాటిలో ఇక్కడ చూడండి.అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై 9 వికెట్లు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా 62 పరుగులతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ 29, మయాంక్ అగర్వాల్ 26 రన్స్ చేశారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు. ఠాకూర్, తాహిర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై .. కేవలం ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే చేధించింది. రుతురాజ్ గైక్వాడ్ 62, డుప్లెసిస్ 48, అంబటి రాయుడు 30 పరుగులు చేశారు.

కాగా, సీజన్‌లో పంజాబ్, చెన్నై జట్లు చెరో 134 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై సూపర్ కింగ్స్ 6మ్యాచ్‌లు గెలిచి... మరో 8 ఓడిపోయింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా.. 6 మ్యాచ్‌లు గెలిచి, మరో 8 ఓడిపోయింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై నిష్క్రమించగా.. ఈ మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్ కూడా ఈ సీజన్‌లో ఆఖరి మ్యాచ్ ఆడినట్లయింది. ఇరు జట్లూ టోర్నీ నుంచి వెళ్లిపోతున్నాయి

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2020, Kings XI Punjab

ఉత్తమ కథలు