ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: బాస్ ఈజ్ బ్యాక్... ఇక సిక్సర్ల సునామే..

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అస్వస్థత నుంచి కోలుకున్నాడు. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్న క్రిస్ గేల్.. రేపు ఆర్సీబీ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది.

news18
Updated: October 14, 2020, 4:48 PM IST
IPL 2020: బాస్ ఈజ్ బ్యాక్... ఇక సిక్సర్ల సునామే..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 14, 2020, 4:48 PM IST
  • Share this:
ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినట్టుగా ఆడే కరేబియన్ సునామి క్రిస్ గేల్ అస్వస్థత నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫిట్ గా ఉన్నాడని కింగ్స్ ఎలెవన్ టీమ్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ టీమ్ తరఫున ఆడుతున్న గేల్.. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. ఫుడ్ పాయిజన్ అయి అతడు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.

అయితే గేల్ ఫుడ్ పాయిజన్ నుంచి బయటపడ్డాడని, ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ మేరకు సోమవారం అతడు నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన ఫోటోలను టీం యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై టీం హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. 41 ఏళ్ల గేల్ అస్వస్థత నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరగబోయే మ్యాచ్ లో అతడు ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఇదే విషయమై టీం యాజమాన్యం స్పందిస్తూ... గేల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. గురువారం కింగ్స్ ఎలెవన్ తలపడనున్న ఆర్సీబీ తో గేల్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది.

దుబాయ్ లోని షార్జా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గేల్ గనక ఆడి నిలదొక్కుకుంటే.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిన్న గ్రౌండ్ కావడంతో యూనివర్సల్ బాస్.. బంతులను అవలీలగా బౌండరీ దాటేస్తాడని చెబుతున్నారు.

ఈ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ విజయాల కోసం పడరాని పాట్లు పడుతున్నది. అయినా విజయాలు ధరిచేరడం లేదు. వరుస మ్యాచ్ లలో ఆ జట్టుకు ఓటములే ఎదురవుతున్నాయి. టీం కెప్టెన్ కెఎల్ రాహుల్ రాణిస్తున్నా.. సమిష్టిగా ఆ జట్టు వైఫల్యాలే మూటగట్టుకుంటున్నది. ఢిల్లీ, రాజస్థాన్, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా.. చేతిలలో ఆ జట్టుకు పరాభావమే ఎదురైంది. ఈ దశలో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. గురువారం రాయల్ ఛాలెంజర్స్ తో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం. ఆ మ్యాచ్ లో గెలిస్తేనే రాహుల్ సేన టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మరి గేల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత మారుస్తాడో లేదో చూడాలంటే.. గురువారం దాకా వేచిచూడాల్సిందే.
Published by: Srinivas Munigala
First published: October 14, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading