Home /News /ipl /

IPL 2020 CHRIS GAYLE FINED FOR CODE OF CONDUCT BREACH SU

IPL 2020: క్రిస్ గేల్‌కు ఫైన్ విధించిన మ్యాచ్ రిఫరీ.. అసలు కారణం అదే..!

క్రిస్ గేల్(Photo-Twitter/KXIP)

క్రిస్ గేల్(Photo-Twitter/KXIP)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ జరిమానా విధించింది. అతడికి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది.

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ జరిమానా విధించింది. అతడికి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గేల్‌పై చర్య తీసుకుంటున్నట్టు వెల్లడించింది. "రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు గేల్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2లోని లెవల్ వన్ అఫెన్స్‌కు పాల్పడ్డాడు. దీంతో మ్యాచ్ రిఫరీ అతనికి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించి లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీదే అంతిమ నిర్ణయం" అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏ సందర్భంలో గేల్ నిబంధలను ఉల్లంఘించాడనే దానిపై మాత్రం ఐపీఎల్ స్పష్టంగా వెల్లడించలేదు. కాగా, రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా 99 పరుగుల వద్ద జౌట్ అయిన గేల్.. మైదానంలో ప్రవర్తించిన తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.

    వివరాలు.. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓడిపోయింది. అయితే పంజాబ్ ఆటగాడు గేల్ మాత్రం ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతుల్లో 99 పరుగులు బాదాడు. అందులో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఒక్క పరుగు తేడాతో సంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అర్చర్ వేసిన బంతికి గేల్ ఔట్ అయ్యాడు. 99 పరుగులు వద్ద ఔట్ కావడంతో ఆవేదన చెందిన క్రిస్ గేల్ బ్యాట్‌ను నేలకు విసిరిగొట్టాడు. దీంతో బ్యాట్ కాస్త దూరంలో పడిపోయింది. ఆ తర్వాత శాంతించిన గేల్.. అర్చర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ కిందపడిన బ్యాట్‌ను గేల్‌కు అందించాడు. ఈ కారణంతోనే మ్యాచ్ రిఫరీ గేల్‌కు జరిమానా విధించినట్టుగా సమాచారం.


    ఇక, ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో విజయం సాధించిన రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను కొద్దిగా సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో గేల్ 99, కేఎల్ రాహుల్ 46 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయాన్ని సాధించింది. రాజస్తాన్ ఆటగాళ్లలో బెయిన్ స్టోక్స్ 50, సంజూ శాంసన్ 48 పరుగులతో రాణించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Chris gayle, IPL 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు