IPL 2020: షార్జాలో చెన్నై చిత్తు చిత్తుగా ఓడింది. సీనియర్లను పక్కనబెట్టి.. కుర్రకారును జట్టులోకి తీసుకున్నా.. CSK ఆట తీరు మారలేదు. వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఎప్పుడూ లేనంత దారుణ ప్రదర్శనతో అపకీర్తిని మూటగట్టుకుంది. శుక్రవారం ముంబై జట్టుకు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడిపోయింది చెన్నై టీమ్. ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్‌లో.. చెత్త ప్రదర్శనతో.. 10 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్ కింగ్స్ అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. కానీ ఇప్పటికీ ధోనీ సేన ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు ఓ అవకాశముంది. ఐతే అది చెన్నై చేతిలో లేదు. ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. అదెలాగో ఇక్కడ చూడండి.
మ్యాచ్ 42: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాలి.
మ్యాచ్ 43: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలి.
మ్యాచ్ 44: తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీపై
చెన్నై ఖచ్చితంగా గెలవాలి.
మ్యాచ్ 45: రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించాలి.
మ్యాచ్ 46: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చేతిలో కేకేఆర్ ఓడిపోవాలి.
మ్యాచ్ 47: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి.మ్యాచ్ 48: ముంబై, ఆర్సీబీ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా పరవాలేదు
మ్యాచ్ 49: కేకేఆర్‌పై జరిగే మ్యాచ్‌లో
చెన్నై ఖచ్చితంగా గెలవాలి.
మ్యాచ్ 50: రాజస్థాన్ రాయల్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓడిపోవాలి.
మ్యాచ్ 51: ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల్లో ఎవరు గెలిచినా ఓకే
మ్యాచ్ 52: ఆర్సీబీ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి.
మ్యాచ్ 53: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై
చెన్నై ఖచ్చితంగా గెలవాలి.
మ్యాచ్ 54: రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపొందాలి.
మ్యాచ్ 55: ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా పరవాలేదు.
మ్యాచ్ 56: ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి.
లీగ్ దశలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. లీగ్ దశలో మరో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్, ఆర్సీబీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లపై జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా విజయం సాధించాలి. అందులో గెలవడంతో పాటు పైన చెప్పినట్లుగా జరిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశముంది.
ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కమాన్ చెన్నై అంటూ.. సీఎస్కే ఫ్యాన్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోకూడదు.. అంతా మంచే జరుగుతుదని ఆశిద్దాం అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.