IPL 2020: రైనా నువ్వు లేని లోటు తెలుస్తోంది.. మళ్లీ రావా..

IPL 2020 - Suresh Raina: చెన్నై వరుస పరాజయాల నేపథ్యంలో.. సోషల్ మీడియా రైనా పేరు తెగ చక్కర్లు కొడుతుంది. పలు సందర్భాల్లో జట్టును ఒంటిచేతితో విజయాలకు చేర్చిన రికార్డు రైనా సొంతం.

news18-telugu
Updated: September 26, 2020, 1:37 PM IST
IPL 2020: రైనా నువ్వు లేని లోటు తెలుస్తోంది.. మళ్లీ రావా..
సురేష్ రైనా(Suresh Raina)
  • Share this:
ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో శుభారంభం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. ఓటమి పాలైన రెండు మ్యాచ్‌ల్లో కూడా డూప్లెసిస్ తప్ప మిగిలిన బ్యాట్సమెన్ ఎవ్వరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్.. జట్టకు బలమైన పునాదిగా నిలవడంలో విఫలమవుతున్నారు. ఈ క్రమంలోనే ధోని కూడా హాట్ కామెంట్స్ చేశాడు. ఓటమి చెందిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో దూకుడు లేకపోవడమే కారణమని చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కూడా అంగీకరించాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో విజృంభించిన అంబటి రాయుడు గాయంతో దూరమయ్యాడు. అతను జట్టుతో చేరితే బ్యాటింగ్‌తో రాణించగలమని ధోని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ క్రమంలో చెన్నై అభిమానుల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ లీగ్ దశ దాటినా తర్వాత అంబటి రాయుడు గాయపడి మ్యాచ్‌కు దూరమైతే.. అప్పుడు పరిస్థతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ప్రతి మ్యాచ్‌లో రాయుడు, డూప్లెసిస్ మాత్రమే రాణించడం కూడా కష్టమేనని అభిమానులు అంటున్నారు. ఇక, చెన్నై వరుస పరాజయాల నేపథ్యంలో.. సోషల్ మీడియా రైనా పేరు తెగ చక్కర్లు కొడుతుంది. పలు సందర్భాల్లో జట్టును ఒంటిచేతితో విజయాలకు చేర్చిన రికార్డు రైనా సొంతం. తన బ్యాటింగ్ మెరుపులతో టాప్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రైనా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టాప్ ఆర్డర్‌లో డూప్లెసిస్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైనా మళ్లీ జట్టులోకి తిరిగి రావాలని కామెంట్లు పెడుతున్నారు. రైనా వస్తే బ్యాటింగ్ పరంగా పటిష్టంగా తయారవుతుందని.. క్లిష్ట సమయాల్లో కూడా రైనా మ్యాచ్‌లను గెలిపించాడని గుర్తచేశారు. చెన్నై యజమాన్యం వరుస ఓటములపై కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు నెటిజనులైతే.. రైనా లేని చెన్నై జట్టు అసంపూర్ణమైందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.




అయితే ఈ సారి ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన రైనా.. కొద్ది రోజులకే ఇండియాకు తిరిగి వచ్చేశాడు. తన కుటుంబ కారణల వల్ల ఈ సారి ఐపీఎల్ ఆడటం లేదని తెలిపాడు. ప్రస్తుతం రైనా ఇండియాలోనే ఉన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading