news18-telugu
Updated: October 24, 2020, 6:20 PM IST
ఎంఎస్ ధోనీ
IPL 2020: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనివినీ ఎరుగని చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ధోనీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఐపీఎల్‌కు కూడా రిటర్మైంట్ ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కష్ట సమయంలో CSK అభిమానులు మాత్రం ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. #CSKforEver హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. లవ్ యూ ధోనీ అంటూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు.
కొన్ని మ్యాచ్‌లు మంచిగా ఆడనంత మాత్రం.. ఐపీఎల్లో అట్టడుగు స్థానంలో ఉన్నంత మాత్రాన.. ధోనీని తక్కువ చేయలేమని ఎంతో మంది నెటిజన్లు ధోనీకి సపోర్ట్ చేస్తున్నారు. సింహం ఎప్పటికీ సింహమేనని ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన లెజెండ్ అని.. గెలుపోటములతో సంబంధం లేదని కామెంట్స్ పెడుతున్నారు.
శుక్రవారం ముంబై జట్టుకు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడిపోయింది చెన్నై టీమ్. ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్‌లో.. చెత్త ప్రదర్శనతో.. 10 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్ కింగ్స్ అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. కాగా, లీగ్ దశలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది
Published by:
Shiva Kumar Addula
First published:
October 24, 2020, 6:09 PM IST