IPL 2020: ట్విటర్ ఫాలోయింగ్‌లో సీఎస్‌కే జోరు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చెన్నై టీమ్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో చెన్నై జట్టు ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

news18-telugu
Updated: October 6, 2020, 9:56 AM IST
IPL 2020: ట్విటర్ ఫాలోయింగ్‌లో సీఎస్‌కే జోరు..
ఎంఎస్ ధోని(MS Dhoni)- (Photo- Twitter/Chennai Super Kings)
  • Share this:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చెన్నై టీమ్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో చెన్నై జట్టు ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ట్విటర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్స్‌కు చేరింది. ఐపీఎల్‌లో మిగతా జట్ల ఫాలోయింగ్‌తో పోలిస్తే ఇదే అత్యధికం. ట్విటర్ ఫాలోయింగ్ పరంగా చెన్నై తర్వాత ముంబై ఇండియన్స్ 5.8 మిలియన్స్ ఫాలోవర్లతో ఉంది.

ట్విటర్‌లో సీఎస్‌కే జట్టు 6 మిలియన్స్ ఫాలోవర్లను చేరుకున్న సందర్భంగా ఆ టీమ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమను ఫాలో అయ్యేవారికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి.. ఎంఎస్ ధోని ఆనందంతో చేతి ఆరు వేళ్లు చూపెడుతున్న ఓ ఫొటోను ఆ జట్టు ట్విటర్‌లో షేర్ చేసింది. అలాగే మిగిలిన సీఎస్‌కే ఆటగాళ్లంతా కూడా తమ చేతి ఆరు వేళ్లను చూపెడుతూ.. అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్టులపై పలువురు సీఎస్‌కే అభిమానులు చాలా ఉత్సహంగా స్పందించారు. " మా సీఎస్‌కే జట్టు ట్విటర్‌లో 6 మిలియన్స్ అభిమానులను సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా వంద క్యాచ్‌లు పూర్తి చేసిన ఎంస్ ధోని సార్‌కు కూడా శుభాకాంక్షలు. మేము మూడు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ.. చాంపియన్స్ ఎప్పటికైనా చాంపియన్సే" అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్ 12 సీజన్లు పూర్తవ్వగా.. అందులో 10 సీజన్లలో ఆడిన చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వలోని చెన్నై జట్టు ఎప్పుడు అభిమానులకు హాట్ ఫేవరేట్టే.


ఇక, ఈ ఐపీఎల్ 13 సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లో శుభారంభం చేసిన సీఎస్‌కే జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని అందుకున్న చెన్నై జట్టు అభిమానుల్లో జోష్ నింపింది.
Published by: Sumanth Kanukula
First published: October 6, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading