ఐపీఎల్ 2020

  • associate partner

గల్లి గల్లిలో.. బంతి బంతికి బెట్టింగ్.. వారం కాకముందే చేతులు మారిన కోట్ల రూపాయలు

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందంటే చాలు ఇండియాలో బెట్టింగ్ రాయుళ్లకు పండగే. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ పెట్టేస్తున్నారు. ఒక్కో మ్యాచ్‌కి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతోంది.

news18-telugu
Updated: September 25, 2020, 10:10 AM IST
గల్లి గల్లిలో.. బంతి బంతికి బెట్టింగ్.. వారం కాకముందే చేతులు మారిన కోట్ల రూపాయలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందంటే చాలు ఇండియాలో బెట్టింగ్ రాయుళ్లకు పండగే. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ పెట్టేస్తున్నారు. ఒక్కో మ్యాచ్‌కి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతోంది. ఇందుకోసం విదేశాల నుంచి బుకీలు రంగంలోకి దిగి.. జనాల్లో ఆశలు కల్పిస్తున్నారు. ఈ బెట్టింగ్‌‌ల్లో చాలా మంది డబ్బులు పొగొట్టుకుంటే.. కొందరినే లక్కు వరిస్తుంది . సులువుగా డబ్బులు వస్తాయి కదా అనే ఆశతో పలువురు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. తీరా చూసేసరికి.. బెట్టింగ్‌లకు బానిసలుగా మారి పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకుంటున్నారు. అయితే ఈ సారి కరోనా పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే చూపినా కూడా బెట్టింగ్ రాయుళ్లలో మాత్రం జోష్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమై వారం రోజులు కాకముందే పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తోంది.

చాలావరకు బయటి దేశాల నుంచి బుకీలు బెట్టింగ్‌ను ఆపరేట్ చేస్గున్నారు. ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా బుకీలు కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈసారి మ్యాచ్‌లు కూడా అక్కడి నుంచే జరగడం వారు మరింత రెచ్చిపోయేలా చేస్తున్నాయి. భారత్‌లోని మెట్రో నగరాల్లో బుకీలకు ఏజెంట్లు కూడా ఉన్నారు. ఈ నెట్‌వర్క్ ఆధారంగానే బుకీలు.. యువతను బెట్టింగ్‌కు బానిసలుగా మారుస్తున్నారు. గతేడాది దాదాపు 45 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని అంచనా వేయగా.. ఈ సారి ఆ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగానే సాగుతుంది. హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, నగరంలో ప్రముఖ హోటల్ గదులు కేంద్రంగా ఈ దందా సాగుతుంది. విశాఖ, విజయవాడ, వరంగల్‌లో కూడా బెట్టింగ్ భారీగానే జరుగుతోంది. కేవలం మ్యాచ్ ఫలితాలపైనే కాదు.. టాస్ పడినప్పటి నుంచి మొదలు.. బాల్ బాల్ కు బెట్టింగ్ కాస్తున్నారు. ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారు?, ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు, ఫోర్లు ఎన్ని కొడతారు, సిక్స్‌లు ఎన్ని కొడతారు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్‌‌లు కాస్తున్నారు.

ప్రత్యేక యాప్‌లు, వాట్సప్ గ్రూప్‌లు..
బెట్టింగ్ కోసం చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెట్టింగ్ కోసం ప్రత్యేక యాప్‌లు కూడా ఉన్నాయి. చాలా వరకు విదేశాల నుంచే ఈ యాప్‌లు నడుస్తున్నాయి. మరోవైపు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా కూడా బెట్టింగ్ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది. కొందరు తమ తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సాంకేతిక పెరిగిపోవడంతో..ఇప్పుడు బెట్టింగ్ డబ్బులు చెల్లింపులకు కూడా ఆన్‌లైన్ వేదికగా నిలిచింది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చేతులు మారుతుంది.

సిటీలు మాత్రమే కాదు..
కొన్నేళ్ల వరకు కూడా బెట్టింగ్ అనేది ఎక్కువగా మెట్రో నగరాలు, కొన్ని పట్టణాలకు పరిమితం అయి ఉండేంది. చిన్న చిన్న పట్టణాల్లో బెట్టింగ్ ఉన్నప్పటికీ.. అది పరిమితంగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మారుముల పల్లెలకు కూడా బెట్టింగ్ విస్తరించింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉండటంతో... వారు నేరుగా బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు.

పలు కుటుంబాల్లో విషాదం..బెట్టింగ్‌లు కొన్ని కుటుంబాల్లో విషాదాన్నేనింపుతున్నాయి. బుకీల ఉచ్చులో చిక్కుకుని.. డబ్బులు కోసం ఏం చేయాలో తెలియకు కొందరు దొంగతనాలకు దిగితే.. మరికొందరు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నే నింపుతోంది. మరోవైపు బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు, నిపుణులు చెబుతున్నప్పటికీ.. వారి మాటలను పట్టించుకోవడం లేదు. పలుచోట్ల పోలీసులు దాడులు జరిపి బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ.. ఎవరూ భయపడటం లేదు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా జనాల్లో మార్పు రావాల్సిందే కదా.
Published by: Sumanth Kanukula
First published: September 25, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading