IPL 2020: క్రికెట్ కంటే ఆరోగ్యమే ముఖ్యం.. అజింక్యా రహానె ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2020 Latest Updates | సాధారణ పరిస్థితులు ఉంటే తన కుటుంబ సభ్యులను ఐపీఎల్ 2020 టోర్నీ జరగనున్న దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు తాను ఇష్టపడేవాడినని అజింక్యా రహానె చెప్పాడు. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు, ఆటగాళ్లు..మిగిలిన అందరి ఆరోగ్య అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నాడు.

news18-telugu
Updated: August 2, 2020, 8:20 AM IST
IPL 2020: క్రికెట్ కంటే ఆరోగ్యమే ముఖ్యం.. అజింక్యా రహానె ఆసక్తికర వ్యాఖ్యలు
అజింక్యా రహానే(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐపీఎల్ 2020 టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ఆడేందుకు వెళ్లే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా అక్కడకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారా? ఇవ్వరా? అనే అంశం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌ను వీడి ఐపీఎల్ 2020 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్న క్రికెటర్ అజింక్యా రహానె స్పందించారు. దుబాయ్ వెళ్లేందుకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు తుది నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అందరి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

సాధారణ పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులను దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు తాను ఇష్టపడేవాడినని రహానె చెప్పాడు. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు, ఆటగాళ్లు..మిగిలిన అందరి ఆరోగ్య అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్ కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తానన్నాడు. గత 4-5 మాసాలుగా లాక్‌డౌన్ కారణంగా కుటుంబంతో గడిపేందుకు అవకాశం లభించిందన్నాడు. కాగా ఢిల్లీ కాపిటల్స్ కోసం ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అజింక్యా రహానె చెప్పాడు. ఆ జట్టులో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు.

ipl 2020 latest updates, ipl 2020 schedule, ipl 2020 uae updates, ipl 2020 new schedule, ajinkya rahane, delhi capital players, అజింక్యా రహానె, ఐపీఎల్ 2020 షెడ్యూల్, ఐపీఎల్ 2020 తేదీలు
అజింక్యా రహానె(ఫైల్ ఫోటో)


సాధారణంగా ఏప్రిల్-మే మాసాల్లో జరగాల్సిన ఐపీఎల్ 2020 కోవిడ్ కారణంగా వాయిదాపడింది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ కూడా వాయిదాపడటంతో సెప్టెంబర్-నవంబర్ మాసాల్లో ఐపీఎల్ 2020 టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Published by: Janardhan V
First published: August 2, 2020, 8:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading