srh vs rcb: డివిలియర్స్ హాఫ్ సెంచరీనా.. ఆశ్చర్యమే

ఐపీఎల్లో ఆస్సీబీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అంతటి అభిమానులున్న ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికన్ ప్లేయర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.


Updated: September 22, 2020, 5:12 PM IST
srh vs rcb: డివిలియర్స్ హాఫ్ సెంచరీనా.. ఆశ్చర్యమే
KohliABD
  • Share this:
ఐపీఎల్లో ఆస్సీబీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అంతటి అభిమానులున్న ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికన్ ప్లేయర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఫ్యాన్స్ ఆశించినంత ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ అతడిపై అభిమానం చూపేవారి సంఖ్యమాత్రం తగ్గలేదు. ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో గెలవడంపల్ల ఏబీ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

2020 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ శుభారంభం చేసింది. సోమవారం సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ హాఫ్ సెంచరీ చేశాడు. కాస్త విరామం వచ్చినప్పటికీ పరుగులు చేయడానికి డివిలియర్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. యంగ్ స్టార్ దేవదత్ పాడికల్తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఆ తరువాత అనుకోకుండా బ్యాటింగ్ లైనప్ కూలిపోయింది. ఈ క్రమంలో జట్టును ఆదుకున్న డివిలియర్స్.. 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆర్సీబీ ప్రత్యర్థికి 164 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తన ఆటతీరు, హాఫ్ సెంచరీ చేయటం ఆశ్చర్యంగా అనిపించిందని అతడు చెబుతున్నాడు.

* పోటీ అంటే ఇష్టం
ఆర్సీబీ స్వల్ప తేడాతో విజయం సాధించిన తరువాత ఏబీ మాట్లాడాడు. “నిజం చెప్పాలంటే నా ఆటతీరుతో నేనే ఆశ్చర్యపోయాను. మేము దక్షిణాఫ్రికాలో ఆడేటప్పుడు పోటీ వాతావరణం ఉండేది. అది నాకు నచ్చేది. ఇక్కడ ఆడటం నాకు ముఖ్యం. ఆత్మవిశ్వాసంతోనే ఇక్కడికి వచ్చాను” అని ఏబీ చెప్పాడు. అతడు ఈ ఏడాది జనవరిలో బిగ్ బాష్ లీగ్లో ఆడాడు. ఆ తరువాత జూలైలో దక్షిణాఫ్రికాలో 3టి క్రికెట్ ఆడాడు.

"ఇక్కడకు వచ్చి బాగా ఆడకపోతే నామీద నాకే అనుమానం వస్తుంది. కానీ మేము గత నాలుగు వారాల్లో వ్యక్తిగతంగా, ఒక జట్టుగా చాలా కష్టపడ్డాం. గెలుపుతో మా ఆట మొదలుకావడం ఉత్సాహాన్నిస్తుంది. ఇది మంచి ప్రారంభం. దురదృష్టవశాత్తు చివర్లో రనౌట్ అయ్యాను. కానీ నా ఆటపై సంతృత్తితో ఉన్నాను” అని వివరించాడు డివిలియర్స్. ఈ మ్యాచ్లో పది పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading