పాకిస్థాన్ ప్రజల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. వారి కోరికను భారత ప్రభుత్వం తీరుస్తోంది. ఇంతకీ ఆ కోరిక ఏంటి? భారత ప్రభుత్వం తీర్చడమేంటి అనుకుంటున్నారా? అది నిజమే. విషయం ఏంటంటే? అక్టోబర్ నెలలో టీ20 ప్రపంచ కప్ పోటీలు భారత్ లోనే జరగనున్నాయి. అయితే ఈ ఏడాది టీ 20 ప్రపంచకప్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ ప్రపంచకప్‌లో అనేక దేశాలకు చెందిన జట్లతో పాటు పాకిస్థాన్ జట్టు కూడా పాల్గొననుంది. టీ20కి భారత్ వేదిక కానుండటంతో ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లకు భారత్ వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర అన్ని దేశాల విషయంలో ఎలాంటి సమస్య లేకున్నా పాకిస్థాన్ ఆటగాళ్ల విషయంలో మాత్రం తీవ్ర సందిగ్ధం నెలకొంది.
భారత్, పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న టీ 20 టోర్నీలో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు టోర్నీలో పాల్గొనాంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకే వీసాల మంజూరుపై తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహసాన్ మనీ కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు.
భారత ప్రభుత్వం నుంచి తమకు ఈ హామీ ఇప్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై చర్చించేందుకు బీసీసీఐతో ఐఐసీ ఇటీవలే సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల మంజూరుపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించనట్లు ఐఐసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బిసిసిఐ కార్యదర్శి జే షా ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో జరగబోయే టీ 20 ప్రపంచకప్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు వీసాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది. మ్యాచ్‌లు చూడటానికి వచ్చే పాకిస్థాన్ అభిమానులను సరిహద్దుల మీదుగా రానివ్వాలా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
భారత దేశం టీ20కి ఆతిథ్యమిస్తోంది. అయితే ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య సరిహద్ధు ద్రిక్తతల కారణంగా చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు. చాలా సంవత్సరాల తర్వాత భారత్ పాక్ తలపడనున్నాయి. ఈసారి జరగబోయే ఐసీసీ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల స్టేడియాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండో సిరీస్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన పాక్ 3–1తో టీ 20 సరీస్‌ను దక్కించుకుంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.