ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్ ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చేసింది..

వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై తుది షెడ్యూల్‌కు ఆమోద ముద్రవేయనుంది. అనంతరం ఏ రోజు ఏయే జట్లు మ్యాచ్‌ ఆడాతాయన్న పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

news18-telugu
Updated: July 24, 2020, 3:50 PM IST
IPL 2020: ఐపీఎల్ ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చేసింది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్‌లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఐతే ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ టోర్నీ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. మ్యాచ్‌లను కుదించలేదని.. అన్ని మ్యాచ్‌లూ నిర్వహిస్తామని చెప్పారు.వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై తుది షెడ్యూల్‌కు ఆమోద ముద్రవేయనుంది. అనంతరం ఏ రోజు ఏయే జట్లు మ్యాచ్‌ ఆడాతాయన్న పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. కాగా, వాస్తవానికి మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ మెగా క్రికెట్ టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ప్రస్తుతం మనదేశంలో కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు..
Published by: Shiva Kumar Addula
First published: July 24, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading