అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ శుక్రవారం విడుదల కానున్నది. అంటే సెప్టెంబరు 4న ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లీగ్ షెడ్యూలును శుక్రవారం విడుదల చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటార్య్వూలో మాట్లాడుతూ.. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంలో అలస్యం జరిగింది. దాన్ని శుక్రవారం విడుదల చేస్తాం’’ అన్నారు. ఇక్కడే అసలు ట్వీస్ట్ ఉంది. షెడ్యూలును పూర్తిగా విడుదల చేయారని తెలుస్తోంది. పరిస్థితులను అంచనా వెస్తూ షెడ్యూల్‌ను భాగాలు విడుదల చేయాలని బీసీసీఐ అంతర్గత సమావేశాలలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ అధికారికి కరోనా
యూఏఈలో ఉన్న బీసీసీఐ బృందంలోని ఓ సభ్యుడికి కరోనా సోకింది. అతను జాతీయ జట్టు సహయ సిబ్బందిలో సభ్యుడని, సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ళ కోసం అతన్ని నియమించినట్లు బోర్డు అధికారి తెలిపారు. ఐపీఎల్‌ను కరోనా వెంటాడుతునే ఉంది. తాజాగా చెన్నై టీంలోని 13 మంది కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ ఆటగాళ్ళు జియో ట్యాగింగ్‌తో అనుక్షణం గమనిస్తో్ంది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.