హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

జల్సాలు చేయడానికి దుబాయ్ రాలేదు.. ఆ విషయం గుర్తుంచుకోండి: కోహ్లీ

జల్సాలు చేయడానికి దుబాయ్ రాలేదు.. ఆ విషయం గుర్తుంచుకోండి: కోహ్లీ

ఆర్సీబీలో స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికి కీలక సమయాలలో రాణించడంలో విఫలమవుతున్నారు. తొలి గేమ్‌లో మెరిసిన కన్నడిగ దేవేంద్ర పాడికల్ రెండో గేమ్‌లో స్వల్ఫ పరుగులకే పెవిలియన్ చేరాడు.  ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ నిలకడగా ఆడలేక పోతున్నాడు. ఫాస్ట్ బౌలర్ల కూడా ఆర్సీబీకి సమస్యగా మారారు.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీం మెంబర్స్‌కు హితభోద చేశారు. దుబాయ్‌కి వచ్చింది సరదాగా గడపడానికి కాదని ఆ విషయాన్ని ఆటగాళ్ళు గుర్తించాలన్నారు.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీం మెంబర్స్‌కు హితభోద చేశారు. దుబాయ్‌కి వచ్చింది సరదాగా గడపడానికి కాదని ఆ విషయాన్ని ఆటగాళ్ళు గుర్తించాలన్నారు. ఐపీఎల్‌-2020 విజయవంతం అవ్వడంలో అందరూ సహకరించాలని కోరారు. అలాగే బయోబడుగను అందరూ గౌరవించి తీరాల్సిందే అన్నారు. తాజాగా ఆర్‌సీబీ యూట్యూబ్‌ షో ‘బోల్డ్‌ డైరీస్‌’లో పాల్గోన్నా కోహ్లీ పలు విషయాలను వెల్లడించారు.

క్రీడా స్పూర్తి దెబ్బతీయకుండా బీసీసీఐ నిబంధనలకు అందరూ తప్పకుండా పాటించాలి. మనం క్రీడాకారులం, క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాం. టోర్నీ దిగ్విజయంగా కోనసాగాలంటే బయోబుడగను గౌరవించాలి. జల్సా చేసేందుకు దుబాయ్ రాలేదు,ఇప్పుడు మన ముందు చాలా సవాళ్ళ ఉన్నాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన చూట్టూ సాధరణ పరిస్ధితులు లేవన్నారు.

అలాగే తను లాక్‌డౌన్‌ సమయంలో క్రికెట్‌కు పూర్తిగా దూరమవ్వలేదన్నారు కోహ్లీ. మెుదటిలో అసలు ఐపీఎల్ జరుగుతుందని నేను అనుకోలేదు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్రికెట్‌ను చాలా మిస్ అయ్యామని అనిపించింది. సాధన మెుదలు పెట్టినప్పుడు కాస్త ఆందోళనగా అనిపించింది. చాలా సార్లు క్రికెట్‌కు విరామం లభించిన అప్పట్లో ఈ ఫీలింగ్ రాలేదంటూ చేప్పుకోచ్చారు.

First published:

Tags: Bcci, Dubai, IPL 2020, UAE, Virat kohli

ఉత్తమ కథలు