ఐపీఎల్ 2020

  • associate partner

IPL Winners List 2008-2019: ఐపీఎల్ విజేతలు వీరే..! ఎక్కవ సార్లు గెలిచింది ఆ జట్టే

IPL Winners List: IPL 2020 టోర్నీని ఏ జట్టు గెలుస్తుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. భవిష్యత్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై స్పష్టత లేకపోయినప్పటీకి.. ఇప్పటీకి వరకు జరిగిన టోర్నీలలో విజేతలు ఎవరు నిలిచారో ఓపారి గుర్తుచేసుకుందాం..

Rekulapally Saichand | news18-telugu
Updated: September 13, 2020, 1:50 PM IST
IPL Winners List 2008-2019: ఐపీఎల్ విజేతలు వీరే..! ఎక్కవ సార్లు గెలిచింది ఆ జట్టే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐపీఎల్ మైదలై పన్నెండేళ్లు అవుతోంది. అభిమానులు కేరింతల మద్య, ప్లైడ్  లైట్ తళుకులు మధ్య కొనసాగే మ్యాచ్‌లు ఒక్కవైపు..వేలంలో కోట్లా రూపాయిలతో తడిసిపోయే ఆటగాళ్ళు మరోవైపు.ఐపీఎల్ టోర్నీ ఓ రకంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే.  2008లో ఐపీఎల్ మొదటి టోర్నీ జరగ్గా...2019 వరకు 12 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం టర్నీ జరిగింది.  అలాంటి ఈ రిచ్ లీగ్‌కు కష్టం వచ్చి పడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక అంక్షలతో 13వ ఐపీఎల్ లీగ్ యుఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి జరగనుంది. 

మెుదటిలో టోర్నీ జరగడంపై అనుమానాలు ఉండేవి. అసియా,టీ20 ప్రపంచ కప్ వాయిదా పడడంతో ఏదో విధంగా ఐపీఎల్ చూడలనే ఫ్యాన్స్ కల నేరవేరనుంది. సెప్టెంబర్19 నుంచి యుఏఈ వేదికగా లిగ్ కొనసాగనుంది. అయితే IPL 2020లో  ఎవరు గెలుస్తారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 2008లో మొదటి టోర్నీని రాజస్థాన్ రాయల్స్ గెలుచుకోగా...2019లో ముంబై ఇండియన్స్ లీగ్‌ను సొంతం చేసుకుంది.

భవిష్యత్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై స్పష్టత లేకపోయినప్పటీకి.. ఇప్పటీకి వరకు జరిగిన టోర్నీలలో విజేతలుగా ఎవరు నిలిచారో ఓపారి గుర్తుచేసుకుందాం..

2008 IPL విజేత - రాజస్థాన్ రాయల్స్
2009  IPL విజేత - డెక్కన్ ఛార్జర్స్
2010 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్
2011 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్2012 IPL విజేత - కోల్‌కతా నైట్ రైడర్స్
2013 IPL విజేత - ముంబై ఇండియన్స్
2014 IPL విజేత - కోల్‌కతా నైట్ రైడర్స్
2015 IPL విజేత - ముంబై ఇండియన్స్
2016 IPL విజేత - సన్‌రైజర్స్ హైదరాబాద్
2017 IPL విజేత - ముంబై ఇండియన్స్
2018 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్
2019 IPL విజేత - ముంబై ఇండియన్స్

అత్యధికంగా ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలవగా...చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు లీగ్‌ను గెలుచుకుంది. కోల్‌కతా నైట్ రౌడర్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మూడుసార్లు ఫైనల్స్‌లో ఓడిపోవడంతో కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ అందని ద్రాక్షగానే ఉంది.
Published by: Rekulapally Saichand
First published: September 13, 2020, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading