ముంబై టీంలో అర్జున్.. జట్టులోకి ఎలా వచ్చడంటే!

తండ్రి సచిన్ టెండుల్కర్ నుంచి బౌలింగ్ మెళుకవలు నేర్చుకుంటున్న అర్జున్.

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ ముంబాయ్ ఆటగాళ్ళతో కలిసి నెట్ ప్రాక్టీస్‌లో బాగా కష్టపడుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోను అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 • Share this:
  సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ ముంబాయ్ ఆటగాళ్ళతో కలిసి నెట్ ప్రాక్టీస్‌లో బాగా కష్టపడుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోను అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్జున్ ఏంటి ఐపీఎల్ ఆడడం ఏంటి అనుకుంటున్నారా! ఐపీఎల్ 2020 సీజన్ కోసం‌ ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ అర్జున్‌ను తమ జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

  ప్రస్తుతం యూఏఈలో ఉన్న అర్జున్ అందరీ ఆటగాళ్ళ లాగే నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని ముంబై జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆర్జున్.. తండ్రిలాగే క్రికెట్‌లో శిఖర స్ధాయికి చేరాలని అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగే​ట్రం కోసం ప్రయత్నాలు మెుదలుపెట్టాడు. ఐపీఎల్ వేదికగా జాతీయ టీంలోకి అడుగుపెట్టాలని ఊవ్విలూరుతున్నాడు. ఇంగ్లండ్‌లో ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. ఏడాదిలో ఎక్కువ నెలలు గడుపతున్నారు.


  అర్జున్ షేర్ చేసిన ఫోటోలో బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, ఇతర ఆటగాళ్ల ఉన్నారు. వారితో పాటు ఉన్న అర్జున్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయి చేస్తున్నారు. కాగా ఫొటోలో ఉన్న అందరూ బౌలేర్లే కావడం గమానార్హం. అయితే ముంబై టీంలోకి అర్జున్‌ని తీసుకున్నట్లు ఆ ప్రాఛైంజీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏ క్రికెటరైనా గాయపడితే వేలంలో కొనుగొలు చేయకపోయిన సదరు ప్రాంచైజీ తీసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పిస్తోంది. అలానే ముంబై జట్టులోకి అర్జున్ టెండూల్కర్ వచ్చినట్లు సమాచారం.
  Published by:Rekulapally Saichand
  First published: