అసలు విషయాన్ని చెప్పిన పాండ్య.. హఫ్ సెంచరీ తర్వాత ఎందుకలా చేశాడంటే..?

మెరుపు అర్ధశతకాన్ని సాధించిన పాండ్యా.. మోకాళ్లపై కూర్చొని చేయి పైకెత్తి పిడికిలి బిగించి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు.

మెరుపు అర్ధశతకాన్ని సాధించిన పాండ్యా.. మోకాళ్లపై కూర్చొని చేయి పైకెత్తి పిడికిలి బిగించి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు.

 • Share this:
  g

  ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్, ముంబయి ఇండియన్స్  మధ్య బిగ్ ఫైట్ జరిగిన విషయం తెలిసిందే. మెుదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్‌ల వర్షం కురిపించాడు.  కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో కార్తీక్ త్యాగి బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 18, 20 ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించి ముంబైకి భారీ స్కోర్ అందించాడు.అతని వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా ముంబై నిర్ణిత 20 ఓవర్లో  195 స్కోర్ చేసింది.

  అయితే ఈ మ్యాచ్‌లో  మెరుపు అర్ధశతకాన్ని సాధించిన పాండ్యా.. మోకాళ్లపై కూర్చొని చేయి పైకెత్తి పిడికిలి బిగించి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు. దీన్ని చూసిన కెప్టెన్‌ పొలార్డ్‌  నవ్వుతూ పిడికిలి బిగించి చేయి పైకెత్తాడు. ఈ ఆసక్తర దృశ్యాన్ని చూసిన వారందరూఒక్కసారిగా షాకయ్యారు. ఇలా ఎందుకు చేశాడో తెలియక తికమకపడ్డారు. దాని వెనుకలా ఉన్న అసలు కథను  పాండ్య తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

  పిడికిలి పైకెత్తిన చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన పాండ్యా " ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది"(బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌) ఉందనే క్యాప్షన్‌ను జతచేశాడు.జాతి వివక్షకు వ్యతిరేకంగా 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' పేరుతో నల్ల జాతీయులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇలా క్రీడారంగంలో ఉన్న జాతీ వివక్షత అంశాన్ని తెరపైకి తెస్తూ హైదరాబాద్‌ ఆటగాడు, వెస్టిండీస్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌  ఐపీఎల్ నల్ల జాతీయులు తమ గళాన్ని వినిపించాలన్నారు. తాజాగా   హార్దిక్‌ పాండ్య తన హఫ్ సెంచరీ సాధించిన తర్వాత ఈ వివక్షపై మద్దతు పలుకుతూ  తన  పిడికిలిని బిగించి పెవిలియన్‌లో ఉన్న పోలార్డ్ వైపు చూపించాడు.
  Published by:Rekulapally Saichand
  First published: