పాండ్యా, క్రిస్‌ మోరిస్‌ మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

Hardik Pandya, Chris Morris reprimanded for verbal exchange

ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ప్రయత్నించే రెండు జట్ల ఆటగాళ్ళ భావోద్వేగాలు నియంత్రించుకోవడం చాలా కష్టమైన పని. ఎదుటి జట్టు ఆటగాడు కాస్త అటు ఇటు ఆడే ప్రయత్నం చేసాడో ఇక అంతే సంగతులు

 • Share this:


  ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ప్రయత్నించే రెండు జట్ల ఆటగాళ్ళ భావోద్వేగాలు నియంత్రించుకోవడం చాలా కష్టమైన పని. ఎదుటి జట్టు ఆటగాడు కాస్త అటు ఇటు ఆడే ప్రయత్నం చేసాడో ఇక అంతే సంగతులు. పత్యర్థి జట్టు నుంచే వచ్చే స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో రుచి చూడక తప్పదు. ఇలాంటివి సాధరణం అనిపించిన.. ఇవి క్రీడా స్పూర్తిని విఘాతం కలిగించే అంశాలే. ప్రత్యర్థి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆటగాళ్లు తరుచూ స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ ఉంటారు. ఇక నువ్వా నేనా అంటూ ఉత్కంఠగా సాగే ఐపీఎల్ లాంటి లీగ్‌లోనూ ఇలాంటి ఘటనలు అనేకం. అవేశాన్ని నియంత్రించుకో లేక  మైదానంలో దూకుడు వ్యవహిరించే ఆటగాళ్ళ అనేకం.

  తాజాగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మద్య జరిగిన మ్యాచ్‌లో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌,ముంబై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ముంబై విజయానికి చేరువవుతున్న సమయంలో 19వ ఓవర్‌లో మోరిస్‌ వేసిన బంతిని పాండ్యా సిక్స్‌ కొట్టాడు. అదే ఓవర్‌లోని ఐదో బంతికి మోరిస్‌... పాండ్యాను ఔట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించి  క్యాచ్‌గా అవుటయ్యాడు.

  ఈ క్రమంలో ఇద్దరూ గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ పెర్కొన్నారు. బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్. బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో మూడు సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 25, డికాక్ 18, హార్దిక్ పాండ్యా 17, కృనాల్ పాండ్యా 10, సౌరబ్ తివారి 5, పొలార్డ్ 4 పరుగులు చేశారు. వికెట్లు పడుతున్నా..సూర్య కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, యుజ్వేంద్ర చాహల్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ పడగొట్టాడు.
  Published by:Rekulapally Saichand
  First published: