Anushka Sharma: అనుష్క శర్మ రషీద్ ఖాన్ భార్యనట..! గూగుల్ తల్లీ.. ఇది నీకు తగునా..?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ భర్త ఎవరు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. కానీ గూగుల్ మాత్రం అనుష్క శర్మను అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా చూపిస్తుంది.. ఎందుకిలా..?

news18
Updated: October 12, 2020, 1:27 PM IST
Anushka Sharma: అనుష్క శర్మ రషీద్ ఖాన్ భార్యనట..! గూగుల్ తల్లీ..  ఇది నీకు తగునా..?
రషీద్ ఖాన్, అనుష్క శర్మ (ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: October 12, 2020, 1:27 PM IST
  • Share this:
అఫ్ఘాన్ క్రికెటర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్ తెలుసుకదా.. ఆయన భార్య పేరు మీకు తెలుసా..? అయితే గూగుల్ సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేయండి. రషీద్ ఖాన్ భార్య పేరు అనుష్క శర్మ అని వస్తుంది. మీరు విన్నది, చూసేది నిజమే. అది మన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మనే. అదేంటి.. అనుష్క భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి వైఫ్ కదా అనుకుంటున్నారు కదా.. వింతగా ఉంది కదూ.. అయితే ఇది చదవండి. దీని కథా కమామీషేంటో చూద్దాం.

రషీద్ ఖాన్ ఎవరు..?


View this post on Instagram

د خپلواکۍ ۱۰۱مه کالیزه مو نېکمرغه! ‏#HappyIndependenceDayAfghanistan


A post shared by Rashid Khan (@rashid.khan19) on

నిత్యం బాంబుల మోతతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్.. 1998 లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న రషీద్ ఖాన్.. ఏకంగా ఆ టీం వైస్ కెప్టెన్. 2018 జూన్ న ఆ జట్టు ఆడిన తొలి టెస్టులో.. భారత్ తో ఆడిన సభ్యుల్లో అతనొకడు. 20 సంవత్సరాల వయసులోనే టెస్ట్ మ్యాచ్ జట్టుకు కెప్టెన్ కూడా అయి రికార్డులు సొంతం చేసుకున్నాడు. బంతిని గింగిరాలు తిప్పి వికెట్లను గిరాటేయడంలో రషీద్ ది అందెవేసిన చేయి. ఐపీఎల్ లో సన్ రైజర్స్ విజయాల్లో అతడికి కీలక పాత్ర.

అనుష్క శర్మ..


View this post on Instagram

And then, we were three! Arriving Jan 2021 ❤️🙏


A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


ఇక అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2008 లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి రబ్ నే బనాదే జోడీ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. బ్యాండ్ బజా బరాత్, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్, సంజు, పీకే వంటి ఎన్నో చిత్రాలలో ఆమె తన నటనతో మెప్పించారు. విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న ఆమె.. త్వరలోనే తల్లి కాబోతుంది.

గూగుల్ ఎందుకిలా చెబుతున్నది..?
రషీద్ ఖాన్ భార్య గురించి అడిగితే.. గూగుల్ అనుష్క శర్మ అని చూపించడానికి వెనుక ఒక చిన్న కథ ఉంది. 2018 లో అతడు ఇన్ స్టా గ్రాం లో తన అభిమానులతో చాటింగ్ చేస్తున్నప్పుడు.. ‘మీ అభిమాన హీరోయిన్ ఎవరు..?’అని అడిగారు. దానికి రషీద్ ఖాన్ స్పందిస్తూ.. ‘అనుష్క శర్మ, ప్రీతి జింటా’ అని చెప్పారు. ఆ తర్వాత పలు పేపర్లు.. రషీద్ ఖాన్ అనుష్క శర్మ అభిమానిగా వార్తలు రాశాయి. ఇక గాసిప్పుల మీద ఆధారపడి నడిచే వెబ్ సైట్ల కు కొదవే లేదు. అప్పట్నుంచి గూగుల్ కూడా రషీద్ ఖాన్ భార్య గురించి అడిగినప్పుడు అనుష్క శర్మ పేరును చూపిస్తుంది.

అసలు రషీద్ కు పెళ్లైందా..?
గూగుల్ ఏం చూపించినా.. అసలు రషీద్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోనేలేదు. యువ క్రికెటర్ గా సంచలన బౌలింగ్ స్పెల్స్ తో మెస్మరైజ్ చేస్తున్న రషీద్.. తన పెళ్లి గురించి ఒక సందర్భంలో స్పందిస్తూ.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు క్రికెట్ ప్రపంచకప్ నెగ్గిన రోజు తాను పెళ్లిపీఠలెక్కుతానని చెప్పాడు. అదీ సంగతి..
Published by: Srinivas Munigala
First published: October 12, 2020, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading