SRH vs RCB: ఆ 4 ఘటనలను ఈ మ్యాచ్‌లోనే చూశా: వార్నర్

ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో ఫేవరేట్స్‌గా బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీని బ్యాడ్ లక్ వెంటాడింది. మిచెల్ మార్ష్ గాయపడటం, వార్నర్ అనూహ్య రీతిలో రనౌట్ కావడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది


Updated: September 22, 2020, 3:31 PM IST
SRH vs RCB: ఆ 4 ఘటనలను ఈ మ్యాచ్‌లోనే చూశా: వార్నర్
ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(ఫైల్ ఫోటో)
  • Share this:


ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో ఫేవరేట్స్‌గా బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీని బ్యాడ్ లక్ వెంటాడింది. మిచెల్ మార్ష్ గాయపడటం, వార్నర్ అనూహ్య రీతిలో రనౌట్ కావడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. గతంలో తాను ఇలా ఔటైన సంఘటన గుర్తుకు రావడం లేదన్నాడు. గతంలో తాను ఎన్నడూ చూడని నాలుగు ఘటనలు ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్నాయని వార్నర్ చెప్పుకొచ్చాడు.

తన రనౌట్, మార్షల్ ఆత్మస్థైర్యం.చాహల్ బౌలింగ్, దేవదత్ పడిక్కల్ హిట్టింగ్ బ్యాటింగ్ ఈ నాలుగు ఘటనలు ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్నాయని వార్నర్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మార్ష్‌కు నొప్పి బాధించిన బ్యాటింగ్‌కు దిగేందుకు తెగువ ప్రదర్శించాడని వార్నర్ కొనియాడాడు.

దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో గెలిపోదింది.
ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలిచేయర్స్‌ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లతో చేలరేగడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ 153 పరుగుల వద్ద ఆలౌటైంది . బెయిర్‌స్ట్రో, మనీష్ పాండ్యా మినహా ఎవరూ రాణించలేకపోవడంతో జట్టు ఓటమిపాలైంది.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading