జట్టులో చోటు దక్కలేదని యువ క్రికెటర్ ఆత్మహత్య

Under-19 cricketer Sajib

బంగ్లాదేశ్ యువ‌ క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బంగాబందు టీ-20 టోర్నీలో చోటుదక్కకపోవడంతో మనస్థాపం చెందిన మహమ్మద్ సోజిబ్(21) రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు

 • Share this:
  బంగ్లాదేశ్ యువ‌ క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బంగాబందు టీ-20 టోర్నీలో చోటుదక్కకపోవడంతో మనస్థాపం చెందిన మహమ్మద్ సోజిబ్(21) రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్ అండర్ -19 మాజీ ఆటగాడైనా మహమ్మద్ బంగాబందు మెగా టోర్నిలో అవకాశం కోసం తపించాడు. చివరకు తుది జట్టులో చోటుదక్కకపోవడంతో నిరాశ చెందిన అతను ప్రాణాలు తీసుకున్నాడు. బంగాబందు లాంటి బిగ్ టోర్నితో జాతీయ ఎంపిక కావాలన్నా అతనికి ఆశ నీరుగారిపోవడంతో ఇంతటి దారుణానికి తెగబడ్డాడు.  జట్టులో చోటుదక్కకపోవడంతోనే సోజిబ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు.

  అయితే ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది.  ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరిలించినట్లు అధికారి హష్మోత్ అలీ తెలిపారు.

  బంగ్లా టీ20 టోర్నిలో చోటు దక్కపోవడం వల్ల ఒత్తిడి వెళ్ళిన అతను ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం రాత్రి నుంచి సాజిబ్ తన గదిలోకి తాళం వేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి భోజనం కోసం అతన్ని పిలవగా స్పందన రాలేదు. ఉదయం 10:00 గంటల సమయంలో సాజిబ్ తండ్రి పదేపదే పిలిచినప్పటికి స్పందలేకపోవడంతో అనుమానం వచ్చిన సాజిబ్ తండ్రి కీటికిలో గమనించారు. అనంతరం తాడుకు వేలాడుతున్న కొడుకు చూసి పోలీసులను సమచారం ఇచ్చినట్లు " రాజ్‌షాహిలోని బంగ్లా ట్రాక్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఎండి అబ్దుల్ ముక్తాదిర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Rekulapally Saichand
  First published: