ఐపీఎల్ 2020

  • associate partner

ఊపందుకున్న Boycott IPL 2020 ఉద్యమం....చైనా కంపెనీ VIVO స్పాన్సర్‌షిప్ పై నెటిజన్లు ఫైర్...

చైనా కంపెనీ వివోను తమ ట్రోఫీ స్పాన్సర్‌గా కొనసాగించాలని బిసిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత వ్యాపారుల సంఘం(CAIT) తీవ్రంగా వ్యతిరేకించింది. హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది.

news18-telugu
Updated: August 3, 2020, 8:15 PM IST
ఊపందుకున్న Boycott IPL 2020 ఉద్యమం....చైనా కంపెనీ VIVO స్పాన్సర్‌షిప్ పై నెటిజన్లు ఫైర్...
ఐపీఎల్ ట్రోఫీ ( Indian Premier League / twitter )
  • Share this:
IPL 2020 చాంపియన్ షిప్‌కు చైనా కంపెనీ VIVO స్పాన్సర్ షిప్ స్పీడ్ బ్రేకర్ గా మారింది. చైనా కంపెనీ వివోను తమ ట్రోఫీ స్పాన్సర్‌గా కొనసాగించాలని బిసిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత వ్యాపారుల సంఘం(CAIT) తీవ్రంగా వ్యతిరేకించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిల భారత వ్యాపారుల సంఘం సోమవారం హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది. ఐపీఎల్‌ను వెంటనే నిషేధించాలని ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఐపిఎల్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. ఫైనల్ నవంబర్ 10 న జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నాయి.

సిఐఏటి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అమిత్ షా, జైశంకర్‌లకు లేఖ రాశారు, భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయంపై తమ నిరసన వ్యక్తం చేశారు. భారతదేశం సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతున్న నేపథ్యంలో బిసిసిఐ నిర్ణయం ప్రభుత్వ విధానానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.


VIVOను స్పాన్సర్‌గా నిలబెట్టాలన్న బిసిసిఐ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా తీవ్రస్వరం వినిపించింది. RSSతో సంబంధం ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్ మాట్లాడుతూ, "ఐపిఎల్ ఒక వ్యాపారం దానిని నడుపుతున్న వారు దేశ భావాలను పట్టించుకోరు" అని విమర్శించారు. ప్రపంచం మొత్తం చైనాను బహిష్కరిస్తుంటే, ఐపీఎల్ మాత్రం దేశ భావాలను దెబ్బతీస్తోందని పేర్కొంది.

VIVO నుంచి బీసీసీఐకి రూ .440 కోట్లు
బిసిసిఐ, వివోల ఒప్పందం 2022 వరకు ఉంది. VIVOతో బిసిసిఐ తన సంబంధాన్ని తెంచుకుంటే, అది చాలా నష్టపోవచ్చు. ఇటీవల బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ ఐపిఎల్ వంటి టోర్నమెంట్లకు చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్ వల్ల దేశం లాభపడుతోందని అన్నారు. నివేదికల ప్రకారం, వివో నుండి బిసిసిఐ సంవత్సరానికి రూ. 440 కోట్లు అందుకుంటుంది, దానితో ఐదేళ్ల ఒప్పందం 2022 లో ముగుస్తుంది.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading