ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్ళు దూరం

ఐపీఎల్ అరంభ మ్యాచ్‌లు కొంచం డల్‌గా కనిపించనున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఐపీఎల్ మెుదటి వారంలో అందుబాటులో ఉండకపోవచ్చు


Updated: August 17, 2020, 10:13 AM IST
IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్  మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్ళు దూరం
aus vs eng
  • Share this:
ఐపీఎల్ అరంభ మ్యాచ్‌లు కొంచం డల్‌గా కనిపించనున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఐపీఎల్ మెుదటి వారంలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట ఇంగ్లాండ్ పర్యటనకి ఆస్ట్రేలియా వెళ్ళనుంది. ఆ సిరీస్ తేదిలను తాజాగా ప్రకటించారు.

ఇంగ్లాండ్‌,ఆసీస్ మధ్య సెప్టెంబరు 4 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే 21 మందితో కూడిన జట్టుని కూడా ప్రకటించేసింది. ఇందులో ముగ్గురు కొత్త ప్లేయర్స్ ఆస్ట్రేలియా టీమ్‌కి ఆడబోతున్నారు.

అయితే ఈ సిరీస్ కారణంగా ఈ రెండు దేశాల ఆటగాళ్ళు ఐపీఎల్ గైహాజరు కానున్నారు. దీంతో టోర్నీలోని కొంత ఎంటర్టైన్మెంట్‌ను ఫ్యాన్స్ మిస్ కానున్నారు. అన్ని స్రాంఛైజీలలో ఈ ఆటగాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీరి సిరీస్ సెప్టెంబరు 16న ముగియనుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆసీస్,ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే వారు క్వారెంటైన్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో వారు ఐపీఎల్ అల్యసంగా హజరుకానున్నారు.
Published by: Rekulapally Saichand
First published: August 14, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading