వారెవ్వా బ్రాడ్.. దాసోహమంటూ చేతులెత్తేసిన విండీస్

నాలుగు నెలల కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్,వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ విజయవంతంగా ముగిసింది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 2-1 తేడాతో విజ్డెన్‌ ట్రోపీని సొంతం చేసుకుంది.

Rekulapally Saichand
Updated: July 29, 2020, 11:44 AM IST
వారెవ్వా బ్రాడ్..  దాసోహమంటూ చేతులెత్తేసిన  విండీస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నాలుగు నెలల కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్,వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ విజయవంతంగా ముగిసింది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 2-1 తేడాతో విజ్డెన్‌ ట్రోపీని సొంతం చేసుకుంది. ఈ ట్రై టెస్ట్ సిరీస్‌లో మెుదటి టెస్ట్‌ వీండిస్ జట్టు గెలవగా రెండు,మూడు టెస్ట్‌లను ఇంగ్లీష్ జట్టు గెలుచుకుంది. దీంతో ట్రోపీ ఇంగ్లాండ్ జట్టు సొంతమైంది.

ఇక మూడో టెస్ట్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ 197 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 226 పరుగులు చేసింది. 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 269 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. క్రిస్ నోక్స్ 5 వికెట్లు తీయగా,బ్రాడ్ 4 వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టును అలౌట్ చేశారు. ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీయడం బ్రాడ్‌కు ఇది మూడోసారి కావడం విశేషం.

కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు భిన్నమైన వాతావరణంలో మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్‌ విజయవంతం కావడంతో త్వరలో జరగబోయే మరిన్ని మ్యాచ్‌లకు ఇది ఊపునిచ్చింది. కరోనా విజృభిస్తున్న సమయంలో ఆటగాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని
ఐసీసీ పలు కఠిన నిబంధనాలను అమలు చేసింది. బయో సెక్యూర్‌ నిబంధనల మధ్య ఈ సిరీస్ జరిగింది.
Published by: Rekulapally Saichand
First published: July 29, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading