ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ధోనీ సేనకు మరో ఎదురు దెబ్బ.. చెన్నై ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

Dwane Bravo: ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టోర్నీకి దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: October 21, 2020, 4:08 PM IST
IPL 2020: ధోనీ సేనకు మరో ఎదురు దెబ్బ.. చెన్నై ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
ఎంఎస్ ధోని(MS Dhoni)
  • Share this:
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉంది. ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. పాయిట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఎప్పుడూ లేనంతగా దారుణ పరిస్థితుల్లో ఉంది చెన్నై జట్టు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీతో పాటు తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ ఆటగాళ్లతో పాటు చెన్నై అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో చెన్నై జట్టుకు మరో ఎదురుబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టోర్నీకి దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది.

''ఐపీఎల్‌ 2020 సీజన్‌లో డ్వేన్ బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడు' అని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు.

కుడి గజ్జల్లో గాయం కొన్ని రోజులుగా బ్రావోను ఇబ్బంది పెడుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్రావో ‌బౌలింగ్‌ను వేయలేకపోయాడు. అతడికి బదులు రవీండ్ర జడేజా బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో అక్షర్ పటేల్ సిక్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది.

కాగా, ఐపీఎల్‌లో మూడు సార్లు ఛాంపియన్‌గా సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెత్త ప్రదర్శనతో ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. 6 పాయింట్లతో ఎనిమిదో స్థానలో ఉంది. మరో ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలయింది సూపర్ కింగ్స్ టీమ్.

కుర్రాళ్లలో కసి లేకపోవడం వల్లే జట్టు మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతోందని ఇటీవల కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జట్టులో కుర్రాళ్లకు అవకాశం ఎక్కడ ఇచ్చారని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. జగదీశన్ వంటి యంగ్ ప్లేయర్స్‌లో కనిపించని స్పార్క్.. కేదార్ జాదవ్, పీయూష్ చావ్లాలో కనిపించిందా..? అని సెటైర్లు వేశారు. మిగతా జట్లలో కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని.. చెన్నై టీమ్ కూడా యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇస్తే మెరుగైన ప్రదర్శన చేసి ఉండేదని సోషల్ మీడియా వేదికగా కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టుకు దూరమవడం కూడా సీఎస్‌కే అపజయాలకు ఒక కారణమని ట్వీట్స్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading