KKR VS MI: 15 కోట్ల బౌలర్‌పై ఫ్యాన్స్ ఫైర్.. వెనుకేసుకొచ్చిన దినేష్‌ కార్తిక్


Updated: September 24, 2020, 3:15 PM IST
KKR VS MI: 15 కోట్ల బౌలర్‌పై  ఫ్యాన్స్ ఫైర్.. వెనుకేసుకొచ్చిన దినేష్‌ కార్తిక్
pat cummins
  • Share this:


ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం ముంబై ఇండియన్స్,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర ఓటమిని చవిచూసిన  సంగతి తెలిసిందే. ముఖ్యంగా బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ విఫలం చెందడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 3 ఓవర్లు వేసిన కమిన్స్‌ 49 పరుగులు సమర్పించుకున్నాడు. స్టార్ బౌలర్ ఇంత దారుణంగా పరుగులు ఇవ్వడంపై కోల్‌కత్తా అభిమానులు పెదవి విరుస్తున్నారు. సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ చేస్తున్నారు.

SCHEDULE TIME TABLE:

ఈ క్రమంలో కెకెఆర్ కెప్టెన్ దినేష్‌ కార్తిక్‌ మాత్రం కమిన్స్‌‌కు భరోసాగా నిలిచాడు. పాట్‌ కమిన్స్‌‌పై విమర్శించడం సరికాదు. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడానికి కమిన్స్‌‌కు సమయం దొరకలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత కాస్త లేటుగా దుబాయ్‌ వచ్చిన అతను ఎక్కువ సమయం క్వారంటైన్‌లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. అతను మ్యాచ్ అడుతాడో..అడాడో లని అనుమానుంగా ఉన్న సమయంలో రెండు గంటల ముందు కమిన్స్‌‌కు ఆడేందుకు అనుమతి వచ్చిందని.. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా అతన్ని తప్పుపట్టడం సరికాదన్నారు కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తిక్.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading