ఐపీఎల్ 2020

  • associate partner

కొద్దిగా దూకుడు మిస్ అయింది.. అతడు వస్తే సర్దుకుంటుంది.. ఎంఎస్ ధోని

అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే తాము ఓడిపోతున్నామని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ అన్నారు. అతడు లేకపోవడం వల్ల జట్టులో సమతూకం దెబ్బతింటుందని చెప్పాడు.

news18-telugu
Updated: September 26, 2020, 9:51 AM IST
కొద్దిగా దూకుడు మిస్ అయింది.. అతడు వస్తే సర్దుకుంటుంది.. ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని(MS Dhoni)
  • Share this:
దుబాయ్‌: అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే తాము ఓడిపోతున్నామని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ అన్నారు. అతడు లేకపోవడం వల్ల జట్టులో సమతూకం దెబ్బతింటుందని చెప్పాడు. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి చెన్నై జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటమిలు చవిచూసింది. అందులో శుక్రవారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. చెన్నై బ్యాట్స్‌మెన్ తీరుపై కాసింత అసంత‌ృప్తి వ్యక్తం చేశాడు. చెన్నై బ్యాటింగ్ విభాగంలో పసలేదని.. అది తమని బాధిస్తోందని వ్యాఖ్యనించారు.

"ఇది మాకు మంచి మ్యాచ్ అని నేను అనుకోను. తేమ లేనప్పటికీ.. వికెట్ మందగించింది. ఆరంభంలో దూకుడుగా లేకపోవడంతో.. సాధించాల్సిన రన్ రేట్ పెరుగి.. అది ఒత్తిడిత్తిడికి గురయ్యేలా చేస్తోంది.  బ్యాటింగ్‌లో దూకుడు మిస్ కావడం బాధిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో కూడా పొరపాట్లు ఉన్నాయి. స్పిన్నర్స్ ఇంకా పూర్తిగా ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇందుకు సంబంధించి సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. రాయుడు జట్టులో చేరితే టీమ్‌లో బ్యాలెన్సింగ్ వస్తుందని అనుకుంటున్నాను. అలా అయితే తాము అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలవుతుంది. ఇది మాకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది" అని తెలిపారు.


ఇక,ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించి శుభారంభాన్ని అందుకుంది. గాయం కారణంగా ఆ తర్వాత చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌లకు రాయుడు దూరంగా ఉన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading