• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • DELHI CAPITALS VS MUMBAI INDIANS FINAL PREVIEW FORM MOMENTUM BIG MATCH TEMPERAMENT MAKES MI FIRM FAVOURITES GH SA

ఐపీఎల్‌లో ముంబై టైటిల్ జర్నీ... ఒక పరుగు విజయం మళ్ళీ పునరావృతం అవుతుందా!

ఐపీఎల్‌లో ముంబై  టైటిల్ జర్నీ... ఒక పరుగు విజయం మళ్ళీ పునరావృతం అవుతుందా!

ప్రస్తుతం ఐపీఎల్13వ సీజన్ జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఫైనల్లో తలపడిన జట్లు, విజేతగా నిలిచిన జట్ల వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం ఐపీఎల్13వ సీజన్ జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఫైనల్లో తలపడిన జట్లు, విజేతగా నిలిచిన జట్ల వివరాలను తెలుసుకుందాం.

  • Share this:
    ప్రస్తుతం ఐపీఎల్13వ సీజన్ జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఫైనల్లో తలపడిన జట్లు, విజేతగా నిలిచిన జట్ల వివరాలను తెలుసుకుందాం.

    2019లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. రెండు ఉత్తమ జట్లు కావడంతో చివరి బంతి వరకు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయి149- పరుగులు చేయగలిగింది. అయితే, చివరి బంతికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరం ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. కాని, మలింగ వేసిన చివరి బంతికి షార్దుల్ ఠాకూర్‌ అవుట్ అవ్వడంతో 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్కు ఐపీఎల్–12 ట్రోఫీ దక్కింది.

    2018లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌, సిఎస్‌కె జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ 6 వికెట్లు కోల్పోయి178 పరుగులు చేసింది. కాని, చెన్నై నుంచి ఓపెనర్గా బరిలోకి దిగిన షేన్ వాట్సన్ను కట్టడి చేయడంలో సన్రైజర్స్ విఫలమైంది. దీంతో ఐపీఎల్–11 ట్రోఫీ విన్నర్గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.

    2017లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె సూపర్ గెయింట్ జట్లు తలపడ్డాయి.129–8 పరుగులు చేసిన ముంబై జట్లు, ఆ తర్వాత బరిలోకి దిగిన పుణె జట్టును మ్యాచ్‌ను చివరి బంతికి తీసుకువెళ్లింది. మ్యాచ్ గెలవడానికి ఆర్‌పిఎస్‌కు బౌండరీ అవసరం కాగా, వారు రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ముంబై ఇండియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.

    2016లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. యువరాజ్ సింగ్, బెన్ కట్టింగ్కు కూడా మంచి స్కోర్ అందించారు. ఎస్ఆర్హెచ్ 208 భారీ స్కోర్ను చేయగలిగింది. ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ నుండి అర్ధ సెంచరీలు సాధించినప్పటికీ ఆర్‌సిబి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్రైజర్స్ ట్రోఫీని గెలుచుకుంది.

    2015లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు చెందిన లెండ్ల్ సిమన్స్, రోహిత్ శర్మ నుండి అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు దీంతో ముంబై 202 భారీ స్కోర్ను చేయగలిగింది. అయితే, సిఎస్‌కె, మంచి ఆరంభానికి దిగినప్పటికీ, చాలా మంది వికర్లను కోల్పోయింది. దీంతో వారు 20 ఓవర్లలో 161 స్కోరు మాత్రమే చేయగలిగారు. దీంతో ముంబై ఇండియన్స్ను టైటిల్ వరించింది.

    2014లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ జట్లకు చెందిన వృద్దిమాన్ సాహా అజేయంగా నిలిచి రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199- పరుగులు చేయగలిగింది. కాని కోల్కతా జట్టుకు చెందిన మనీష్ పాండే 94 పరుగులు చేసి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్కతా జట్టుకు విజయాన్ని అందించాడు.

    2013లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్స్ కింగ్స్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి చెందిన కీరోన్ పొలార్డ్ 60 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. దీంతో 9 వికెట్లు కోల్పోయి 148- పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సీఎస్కె ప్లేయర్లు ఎంఐ బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ముంబైని టైటిల్ వరించింది.

    2012లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిఎస్కె, కెకెఆర్ జట్లు తలపడ్డాయి. కోల్కతా మ్యాచ్ గెలవడానికి 191 పరుగులు అవసరం ఉండటంతో మన్వీందర్ బిస్లా వీరోచితంగా పోరాడి 89 పరుగులు చేశాడు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది కెకెఆర్.

    2011లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిఎస్‌కె, ఆర్సిబి జట్లు తలపడ్డాయి. సిఎస్కె జట్టుకు చెందిన మురళి విజయ్, మైక్ హస్సీలు అర్ధ సెంచరీలు చేసి 205- భారీ స్కోర్ను అందించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆర్‌సిబి, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147- పరుగులు మాత్రమే చేయగలిగింది.

    2010లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిఎస్కె, ఎంఐ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎమ్‌ఐపై సునాయాస విజయంతో సిఎస్కే తమ తొలి ఐపిఎల్ టైటిల్ విజయాన్ని సాధించింది. సిఎస్‌కె అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై జట్టును146 పరుగుల వద్దే కట్టడి చేయగలిగింది. దీంతో సిఎస్కె టైటిల్ విజేతగా నిలిచింది.

    2009లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్(డిసి), ఆర్సిబి జట్లు తలపడ్డాయి.- ఈ మ్యాచ్లో ఆర్సిబిని ఓడించి డిసి మొదటి, ఏకైక ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకుంది

    2008లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిఎస్కె, ఆర్ఆర్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ గెలవడానికి RR కి ఫైనల్ బంతికి ఒక పరుగు అవసరం కాగా దాన్ని ఛేదించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో ఐపిఎల్ తొలి సీజన్ టైటిల్ను దక్కించుకున్న జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
    Published by:Rekulapally Saichand
    First published: