ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: దిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా.. టెన్షన్‌లో జట్టు

ఐపీఎల్‌కు ఏర్పాట్లు ఎంతో వేగంగా జరుగుతున్నాయో... అంతే వేగంగా ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా వైరస్‌ జాడలు బయటపడ్డాయి.


Updated: September 7, 2020, 12:28 PM IST
IPL 2020: దిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా.. టెన్షన్‌లో జట్టు
ఐపీఎల్‌కు ఏర్పాట్లు ఎంతో వేగంగా జరుగుతున్నాయో... అంతే వేగంగా ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా వైరస్‌ జాడలు బయటపడ్డాయి.
  • Share this:
ఐపీఎల్‌కు ఏర్పాట్లు ఎంతో వేగంగా జరుగుతున్నాయో... అంతే వేగంగా ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా వైరస్‌ జాడలు బయటపడ్డాయి. ఆ జట్టులోని అసిస్టెంట్‌ కోచ్‌కు కరోనా సోకింది ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టే ప్రకటించింది.  అతను ఏ ఆటగాడితో కాంటాక్ట్ లేరని తొలి రెండు పరీక్షల్లో నెగిటివ్‌ రాగా, మూడోసారి ననర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని ఆ జట్టు తెలిపింది.

"ఆ కోచ్ ఎవరితోనే కాంటాక్ట్‌లో లేరు. అతడు జట్టులోనే చేరలేదు. పరీక్షల్లో పాజిటివ్ రాగానే అతను క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే విధుల్లోకి అనుమతి ఇస్తాం. మా వైద్య సిబ్బంది అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అతను త్వరలో కొలుకొని తిరిగి జట్టులోకి రావాలని కోకుకుంటామని" ఆ జట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా వైరస్ చెన్నై సూపర్ కింగ్స్‌ను అనుక్షణం వెంటాడుతునే ఉంది. ఈ మహమ్మారి కారణంగా టోర్నీ వేదికలో మార్పు,తేదీలో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెుదట్లో చెన్నై టీంలోని కొంత మంది సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ పరిణామంతో ఈవెంట్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మరోసారి కరోనా జాడలు బయటపడడంతో ఆ జట్టు టెన్షన్‌లో పడింది
Published by: Rekulapally Saichand
First published: September 7, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading