ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఎవరిని నిందించడం లేదు.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే: డేవిడ్ వార్నర్

IPL 2020: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. తొలిమ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన సన్ రైజర్స్.. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో కూడా పరాజయం పాలైంది.

news18-telugu
Updated: September 27, 2020, 2:02 PM IST
IPL 2020: ఎవరిని నిందించడం లేదు.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే: డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్(David Warner)
  • Share this:
ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. తొలిమ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన సన్ రైజర్స్.. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో కూడా పరాజయం పాలైంది. మనీస్ పాండే మినహా మిగిలిన ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడంతో హైదరాబాద్ జట్టు వేగంగా పరుగులు సాధించలేకపోతుంది. కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం.. సన్ రైజర్స్‌కు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక, కోల్‌కతా చేతిలో సన్‌ రైజర్స్ ఓటమిపై వార్నర్ స్పందిస్తూ.. "కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన బాగోలేదు. తొలుత నేను, బెయిర్‌స్టో బాగా ఆడాలని అనుకున్నాం. ఇంకా కష్టపడి ఉండాల్సింది. అలాగే రిస్క్‌ కూడా తీసుకోవాల్సి ఉందనిపించింది. నేను స్కోర్ వేగాన్ని పెంచాలని అనుకున్న సమయంలో పెవిలియన్‌కు చేరాను. అది కూడా అనవసర బంతికి వికెట్ చేజార్చుకున్నాను. ఈ ఓటమికి నేను ఎవరిని నిందించడం లేదు. బ్యాటింగ్ సరిగా చేయనందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను.

తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాం. ఇంకా ఇద్దరు బ్యాట్స్‌మెన్ బెంచ్ మీదే ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో మరింత కష్టపడాల్సి ఉంది.. నేను అవుట్ అయ్యాక 20 పరుగులు చేయడానికి నాలుగైదు ఓవర్లు పట్టింది. బౌండరీస్ సాధించడం ద్వారా బౌలర్లపై మరింత ఒత్తిడి తీసుకురాగలిగితే మేము మంచి స్కోర్ చేసేవాళ్లం. ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నమోదైన డాట్ బాల్స్ నన్ను మరింత నిరాశ పరిచేలా చేసింది. టీ20లో 35 నుంచి 36 డాట్ బాల్స్ నమోదు కావడం అమోదయోగ్యం కాదు. భారత్‌తో పోలిస్తే దుబాయ్ బౌండరీల దూరం ఎక్కువగా ఉంది. తర్వాత ఆడమోయే మ్యాచ్‌లో మా మైండ్ సెట్ మార్చకుని బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని" తెలిపారు.

ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ వికెట్‌లు చేతిలో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు సాధించడంలో విఫలమైంది. రెండో వికెట్‌గా వార్నర్ పెవిలియన్‌కు చేరాక.. పరుగులు సాధించడానికి మనీష్ పాండే, వృద్దిమాన్ సాహా తీవ్రంగా శ్రమించారు. మనీష్ కొద్దివరకు హిట్టింగ్ చేసిన.. భారీ స్కోర్ చేసేందుకు మిగతా ఆటగాళ్ల నుంచి సాకారం కరువైంది. దీంతో సన్‌రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి.. 142 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు శుభ్‌మన్ గిల్, మోర్గాన్‌ దూకుడుతో టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా జట్టు 18 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్సపై విజయం సాధించింది.
Published by: Sumanth Kanukula
First published: September 27, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading