IPL 2020:మళ్ళీ ఐపీఎల్ టైటిల్ గెలవడమే నా లక్ష్యం : వార్నర్

సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు తిరిగి కెప్టెన్‌గా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్.

Rekulapally Saichand
Updated: July 30, 2020, 5:19 PM IST
IPL 2020:మళ్ళీ ఐపీఎల్ టైటిల్ గెలవడమే నా లక్ష్యం : వార్నర్
david warner
  • Share this:
సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు తిరిగి కెప్టెన్‌గా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. జట్టును విజేతగా నిలపడడమే తన ప్రథమ కర్తవ్యం అన్నారు. మరోసారి టీంకు టైటిల్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానన్నారు. 2016 నుంచి హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్ 2018లో బాల్​ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాడు. ఇక ఐపీఎల్ కూడా దూరమయ్యాడు వార్నర్. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు జట్టు బాధ్యతలు అప్పగించింది జట్టు యాజమాన్యం.

2019లో తిరిగి జట్టులోకి వచ్చిన వార్నర్ సాధరణ ఆటగాడిగానే కొనసాగాడు. ఆటకు విరామం వచ్చిన అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. IPL 2019లో 697 పరుగులతో అదరగొట్టాడు. విలియమ్స్ నాయకత్వంపై అసంతృప్తి ఉన్న జట్టు మెనేజ్‌మెంట్ మరోసారి కెప్టెన్​గా నియమించింది.తిరిగి కెప్ట్‌న్‌‌గా ఎంపీక అవడంపై సంతోషం వ్యక్తం చేశారు వార్నర్. మీడియాకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించాడు. "సన్ రైజర్స్​కు కెప్టెన్‌గా ఎంపిక అవడం చాలా గౌరవంగా భావిస్తున్నా.. ఇది సాధరణ నాయకత్వంలా కాకుండా దీన్ని గొప్ప బాధ్యతగా బావిస్తున్నా.. సిబ్బంది.యాజమాన్యం నా పట్ల విశ్యాసంగా ఉండడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను" అన్నారు
Published by: Rekulapally Saichand
First published: July 30, 2020, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading