DAVID WARNER ONCE AGAIN DANCE FOR BUTTA BOMMA SONG STEPS SU
David Warner: బుట్టబొమ్మ సాంగ్‌కు మరోసారి చిందేసిన వార్నర్.. కానీ ఈసారి మాత్రం..
డేవిడ్ వార్నర్
లాక్డౌన్ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లోని కొన్ని హిట్ సాంగ్స్‌కు వార్నర్ అతడి భార్య క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.
లాక్డౌన్ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లోని కొన్ని హిట్ సాంగ్స్‌కు వార్నర్ అతడి భార్య క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేశాడు. అలాగే పలు డైలాగ్స్‌కు డబ్ స్మాష్ చేసి కూడా అలరించాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో.. చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్, క్యాండిస్ కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్లను బాగా అలరించాయి. తాజాగా మరోసారి బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్ స్టెప్పులేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న వార్నర్.. బుట్టబొమ్మ సాంగ్ వినబడగానే తన చేతులను కదుపుతూ స్టెప్పేశాడు. అయితే ఈ సారి మాత్రం సింగిల్‌గా కుర్చిలో కూర్చొనే వార్నర్ బుట్టబొమ్మ సాంగ్‌కు నవ్వుతూ చిందేశాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ట్విటర్లో ఇప్పటికే ఈ వీడియోకు 35వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక, తెలుగు సాంగ్స్ విషయానికి వస్తే బుట్టబొమ్మతో పాటు, మైండ్ బ్లాక్, రాములో రాములా, పక్కా లోకల్.. సాంగ్స్‌కు వార్నర్ చిందేశాడు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.