ఐపీఎల్ 2020

  • associate partner

csk vs rr రోడ్డుపై పడ్డ ధోనీ కొట్టిన బంతి..ఇంటికి తీసుకెళ్లిన అభిమాని

బాట్స్‌మెన్స్ సిక్సర్‌లతో విరుచుకుపడుతూ..బౌలర్లలపై తమ ప్రతాపాన్ని చూపారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 33 సిక్సర్లు నమోదయ్యాయి. ధోనీ,సంజూ శాంసన్,జోఫ్రా ఆర్చర్,డుప్లీసిస్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించారు.


Updated: September 23, 2020, 5:24 PM IST
csk vs rr రోడ్డుపై పడ్డ ధోనీ కొట్టిన బంతి..ఇంటికి తీసుకెళ్లిన అభిమాని
ఫ్యాన్స్ అడగ్గానే విజిల్ వేసిన మాహీ...
  • Share this:
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అసలైన మజాను రుచి చూశారు అభిమానులు. బాట్స్‌మెన్స్ సిక్సర్‌లతో విరుచుకుపడుతూ..బౌలర్లలపై తమ ప్రతాపాన్ని చూపారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 33 సిక్సర్లు నమోదయ్యాయి. ధోనీ,సంజూ శాంసన్,జోఫ్రా ఆర్చర్,డుప్లీసిస్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించారు. చివరి ఓవర్లో ధోనీ సిక్స్‌లే మ్యాచ్‌కి హైలేట్‌గా నిలిచాయి.  చివరి ఓవర్లో భారీ హిట్టింగ్‌తో రాజస్ధాన్ బౌలర్ కర్రాన్‌కు చుక్కుల చూపించాడు. అయితే సూపర్ కింగ్స్ ఓడినా.. ధోనీ హిట్టింగ్ బ్యాటింగ్‌తో పరుగుల మధ్య అంతరం లేకుండా చూడగలిగాడు.

అయితే చివరి ఓవర్లలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు నిర్వహకులు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. కర్రాన్ వేసిన ఓ బంతిని ధోనీ లాంగ్ ఆన్ దిశగా బలంగా కొట్టాడు. 92 మీటర్ల పైగా వెళ్ళిన ఆ బంతి గ్రౌండ్ బయట ఉన్న రోడ్డు మీద పడింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి నవ్వుతూ ఆ బంతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరి ఓవర్లో కర్రాన్ వరుసగా మూడు సిక్సులు బాది  అభిమానులకు తన పవర్ హిట్టింగ్‌ రుచిని చూపించాడు.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading