హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

CSK vs KXIP, IPL 2020: టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ.. పంజాబ్‌కు చావో రేవో..

CSK vs KXIP, IPL 2020: టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ.. పంజాబ్‌కు చావో రేవో..

ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్ (Image:IPL)

ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్ (Image:IPL)

CSK vs KXIP, IPL 2020: చెన్నై జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. వాట్సన్ స్థానంలో ఫాప్ డుప్లెసిస్, సాంట్నర్ స్థానాంలో ఇమ్రాన్ తాహిర్, కర్ణ్ శర్మ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌ను జట్టులోకి తీసుకున్నారు.

IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో 53వ ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తలపడుతున్నాయి. లీగ్ దశలో ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఈ సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. వాట్సన్ స్థానంలో ఫాప్ డుప్లెసిస్, సాంట్నర్ స్థానాంలో ఇమ్రాన్ తాహిర్, కర్ణ్ శర్మ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అటు పంజాబ్ జట్టు రెండు మార్పులు చేసింది. అర్షదీప్ స్థానంలో మయాంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్ స్థానంలో జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చారు.


జట్ల వివరాలు:

Chennai Super Kings (Playing XI): ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), ఎన్.జగదీశన్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్.

Kings XI Punjab (Playing XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మందీప్ సింగ్, జేమ్స్ నీషమ్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ.


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 22 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. చెన్నై 13 సార్లు విజయం సాధించగా.. పంజాబ్ టీమ్ 9 సార్లు గెలిచింది. టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 4న చెన్నై జట్టు 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి చెన్నైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది. మరోసారి పంజాబ్‌ను ఓడించి.. తమతో పాటు పంజాబ్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ధోనీ సేన పట్టుదలతో ఉంది.

కాగా, ఈ సీజన్‌లో పంజాబ్, చెన్నై జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌లు గెలిచి... మరో 8 ఓడిపోయింది. 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్..6 మ్యాచ్‌లు గెలిచి, మరో ఏడింట ఓడిపోయింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చెన్నైతో పాటు ఇంటికి వెళ్లాల్సిందే. ధోనీ సేన ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2020, Kings XI Punjab

ఉత్తమ కథలు