హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020 LIVE Score, CSK vs DC: ఢిల్లీ భారీ స్కోర్... ధోనీ అలసత్వం.. రెచ్చిపోయిన పృథ్వీ షా

IPL 2020 LIVE Score, CSK vs DC: ఢిల్లీ భారీ స్కోర్... ధోనీ అలసత్వం.. రెచ్చిపోయిన పృథ్వీ షా

Prithvi Shaw

Prithvi Shaw

ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది.

  ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీషా 36 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 పరుగులు చేశాడు. షాకు ఇది ఐపీఎల్ కెరీర్‌లో ఐదో హాఫ్ సెంచరీ. అతనితో పాటు మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (35; 27 బంతుల్లో 3x4, 1x6)  కూడా దాటిగానే ఆడాడు. 35 పరుగులు చేసి చావ్లా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రిషబ్ పంత్ 25 బంతుల్లో 6 ఫోర్ల్‌తో 37 పరుగులు చేశారు.

  SCHEDULE TIME TABLE:


  చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల నిర్లక్ష్యం కూడా షాకు కలుసోచ్చింది. దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ పృథ్వీషా ఔటయ్యాడు. ఆడే క్రమంలో బాల్ బ్యాట్స్‌కు ఎడ్జ్‌కు తగిలి వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్ళింది. కానీ ఎవరూ దాన్ని అప్పీల్ చేయలేదు. టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌కు తాకినట్లు స్పష్టంగా కనబడుతుంది. మెుదట్లోనే లైఫ్ దొరకడంతో రెచ్చిపోయిన షా   ఫోర్ల్‌తో విరుచకుపడ్డాడు.

  ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  ఇరు జట్లు వారి స్క్వాడ్‌లో మార్పులు చేశాయి. చెన్నై జట్టు లుంగిడి ఎంగిడి స్థానంలో జోష్ హజల్ వుడ్ తీసుకొగా,గాయపడ్డ అశ్విన్ స్థానంలో అమిత్ మిశ్రాను.. మోహిత్ శర్మను పక్కన పెట్టి అవేశ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. సీఎస్‌కే-ఢిల్లీల మధ్య 21 మ్యాచ్‌లు జరగ్గా... అందులో చెన్నై 15, ఢిల్లీ 6 మ్యాచ్‌లు గెలిచాయి.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Chennai Super Kings, Delhi Capitals, Dubai, IPL 2020

  ఉత్తమ కథలు