ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 LIVE Score, CSK vs DC: ఢిల్లీ అదుర్స్‌.. చెన్నై జట్టుకు మరో ఓటమి

ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో చెన్నై జట్టు తేలిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్  విఫలమయ్యారు.


Updated: September 26, 2020, 12:01 AM IST
IPL 2020 LIVE Score, CSK vs DC: ఢిల్లీ అదుర్స్‌.. చెన్నై జట్టుకు మరో ఓటమి
CSK VS DC
  • Share this:
ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో చెన్నై జట్టు తేలిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్  విఫలమయ్యారు. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.  సీఎస్‌కే 20 ఓవర్లలో  131 పరుగులు మాత్రమే చేయగలిగింది మరోసారి చెన్నై ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు.

అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతికి షేన్‌వాట్సన్‌(14) భారీ షాట్‌ కొట్టబోయి హెట్‌మెయిర్‌కు‌ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మురళీ విజయ్‌(8) కూడా స్పల్ఫ రన్స్‌కే ఔటయ్యాడు. దీంతో చెన్నై 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అండగా నిలుస్తాడు అనుకున్న రుతురాజ్‌ ఓ అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు.




తర్వాత కేదార్‌ జాధవ్,డుప్లెసిస్ నిలకడగా ఆడినప్పటికి ఫలితం లేకపోయింది. నోర్జే వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి కేదార్‌ జాధవ్‌(26) ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి డుప్లెసిస్‌(43) కీపర్‌కు చిక్కాడు. దీంతో సీఎస్‌కే 18 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 121/5 వికెట్లు కోల్పొయి కష్టాల్లో పడింది. చివరకు ధోనీ కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చలేకపోయాడు. 15 పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరాడు.SCHEDULE TIME TABLE:

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీషా 36 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 పరుగులు చేశాడు. షాకు ఇది ఐపీఎల్ కెరీర్‌లో ఐదో హాఫ్ సెంచరీ. అతనితో పాటు మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (35; 27 బంతుల్లో 3x4, 1x6)  కూడా దాటిగానే ఆడాడు. 35 పరుగులు చేసి చావ్లా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రిషబ్ పంత్ 25 బంతుల్లో 6 ఫోర్ల్‌తో 37 పరుగులు చేశారు.
Published by: Rekulapally Saichand
First published: September 25, 2020, 11:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading