ఐపీఎల్ 2020

  • associate partner

CSK vs DC, IPL 2020 Live Score: రఫ్పాడించిన రాయుడు, డుప్లెసిస్.. ఢిల్లీ గెలిచేనా..?

IPL 2020: ఈ మ్యాచ్‌లో ధోనీ త్వరగా ఔట్ అవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ అవడంతో.. మరోసారి విఫలమయ్యాడని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2020, 9:24 PM IST
CSK vs DC, IPL 2020 Live Score: రఫ్పాడించిన రాయుడు, డుప్లెసిస్.. ఢిల్లీ గెలిచేనా..?
డుప్లెసిస్ (Image:IPL)
  • Share this:
IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో 34వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ సీజన్‌లో రెండోసారి తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 47 బంతుల్లో 58 రన్స్ చేశాడు. ఇక రాయుడు 45 (25 బంతులు), షేన్ వాట్సన్ 36 (28 బంతులు), రవీంద్ర జడేజా (33) పరుగులతో రాణించారు. సామ్ కరన్ (0), ధోనీ (3) మాత్రం విఫలమయ్యారు. వాస్తానికి చెన్నై జట్టు తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ బౌలింగ్‌లో నార్జీకి క్యాచ్ ఇచ్చి కరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డుప్లెసిస్, వాట్సన్ ఆచితూడి ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జట్టుకు విలువైన భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోర్ 87 వద్ద వాట్సన్, 109 పరుగుల వద్ద డుప్లెసిస్, 129 వద్ద ధోనీ ఔట్ అయ్యారు. ఆ తర్వాత రాయుడు, జడేజా మెరుపులు మెరిపించడంతో చెన్నై టీమ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో నార్జీ 2 వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడ తలో వికెట్ సాధించారు.


ఈ మ్యాచ్‌లో ధోనీ త్వరగా ఔట్ అవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ అవడంతో.. మరోసారి విఫలమయ్యాడని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కేదార్ ప్రదర్శన బాగా లేకున్నప్పటికీ మళ్లీ జట్టులోకి తీసుకొని సాహసమే చేశాడు ధోనీ. అతడికి బ్యాటింగ్ రాకపోవడమే మేలయిందని.. లేదంటే బంతులు తింటూ స్కోర్‌ను తగ్గించే వాడని జోకులు పేల్చుతున్నారు.

కాగా, ఐపీఎల్ 2020లో ఇప్పటికే ఓసారి ఇరుజట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి డీసీపై ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. ఢిల్లీ సైతం అదే ఊపును కొనసాగించి రెండోసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా, ఐపీఎల్‌లో డీసీ, సీఎస్‌కే జట్లు 21 సార్లు తలపడ్డాయి. చెన్నై టీమ్ 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుసార్లు మాత్రమే గెలుపొందింది.

కాగా, ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాస్ సేన.. 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచింది. మరో ఐదింటిలో పరాజయం పాలయింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2020, 9:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading