ఐపీఎల్ 2020

  • associate partner
HOME » NEWS » ipl » CSK VS DC IPL 2020 LIVE SCORE CHENNAI SUPER KINGS VS DELHI CAPITALS DHONI WON TOSS CHOOSE BAT FIRST SK

CSK vs DC, IPL 2020 Live Score: టాస్ గెలిచిన ధోనీ.. జట్లలో మార్పులు ఇవే

CSK vs DC, IPL 2020 Live Score chennai super kings vs delhi capitals : చెన్నై టీమ్ ఓకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పీయుష్ చావ్లా స్థానంలో కేదార్ జాదవ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

news18-telugu
Updated: October 17, 2020, 7:33 PM IST
CSK vs DC, IPL 2020 Live Score: టాస్ గెలిచిన ధోనీ.. జట్లలో మార్పులు ఇవే
ధోనీ, శ్రేయస్ అయ్యర్
  • Share this:
IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో 34వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ సీజన్‌లో రెండోసారి తలపడుతున్నాయి. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై టీమ్ ఓకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పీయుష్ చావ్లా స్థానంలో కేదార్ జాదవ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అదే టీమ్‌తో బరిలోకి దిగుతున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్‌కు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ తెలిపాడు.


జట్ల వివరాలు:

Delhi Capitals (Playing XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిషో రబడా, అన్రిచ్ నార్జీ.

Chennai Super Kings (Playing XI): ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శామ్ కరన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, కర్ణ్ శర్మ.


ఈ సీజన్‌లో ఇప్పటికే ఓసారి ఇరుజట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి డీసీపై ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. ఢిల్లీ సైతం అదే ఊపును కొనసాగించి రెండోసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా, ఐపీఎల్‌లో డీసీ, సీఎస్‌కే జట్లు 21 సార్లు తలపడ్డాయి. చెన్నై టీమ్ 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుసార్లు మాత్రమే గెలుపొందింది.

కాగా, ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాస్ సేన.. 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచింది. మరో ఐదింటిలో పరాజయం పాలయింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2020, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading