csk vs rr: చెన్నై ఓటమి.. ఆఖరీ ఓవర్లలో ధోనీ సూపర్ బ్యాటింగ్

rajastan royals

ఐపీఎల్‌-13లో భాగంగా సీఎస్‌కే ,రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ పరిస్ధితులోనూ టార్గెట్ చేధించే దిశగా కనిపించలేదు.

  • Share this:


    ఐపీఎల్‌-13లో భాగంగా సీఎస్‌కే ,రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరుగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ పరిస్ధితులోనూ టార్గెట్ చేధించే దిశగా కనిపించలేదు. ఓపెనర్ వాట్సన్ దాటిగా  ఆడినట్లు కనిపించిన తర్వాత తెలిపోయాడు. రాహుల్ తేవాటియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డు ప్లెసిస్ మినహ ఎవరూ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. 37 బంతుల్లో 7 సిక్స్‌లు ఓ ఫోర్‌తో 72 పరుగులు చేశాడు డు ప్లెసిస్. చివర్లో ధోనీ మూడు సిక్స్‌లు కొట్టి తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. రాజస్ధాన్ బౌలర్  రాహుల్ తేవాటియా మూడు కీలక వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు.

    అంతకుముందు టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫీల్డింగ్‌ ఎంచుకుని.. రాజస్తాన్‌ రాయల్స్‌‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ దిగిన రాజస్ధాన్ స్వల్ఫ పరుగులకే జైస్వాల్‌ వికెట్ కొల్పోయింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్‌(6)పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై బౌలర్లకు చుక్కులు చూపించాడు. 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 9 భారీ సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు.





    ఇక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆర్చర్‌ కూడా తన బ్యాట్‌కు పనిచేప్పాడు. 8 బంతుల్లో 4 సిక్స్‌లు బాది 27 పరుగులు సాధించాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు తీయగా, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌లు ఒక్కో వికెట్‌ తీశారు
    Published by:Rekulapally Saichand
    First published: