Suresh Raina: ధోనీ బాటలోనే సురేష్ రైనా.. క్రికెట్‌కు వీడ్కోలు

ధోనీ, రైనాను రామలక్ష్మణుడిగా పిలుచుకుంటారు అభిమానులు. అలాంటి వీరిద్దరు ఓకే రోజు.. నిమిషాల వ్యవధిలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

news18-telugu
Updated: August 15, 2020, 9:03 PM IST
Suresh Raina: ధోనీ బాటలోనే సురేష్ రైనా.. క్రికెట్‌కు వీడ్కోలు
సురేష్ రైనా
  • Share this:
ఎంఎస్ ధోనీ బాటలోనే టీమిండియా బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మహీ భాయ్.. నీ బాటలోనే నేనంటూ ఇన్‌స్టగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు సురేష్ రైనా. టీమిండియాలో ధోనీ, రైనా మంచి మిత్రులు. టీమ్‌లో సురేష్ రైనాకు ధోనీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఐపీఎల్‌లోనూ ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధోనీ, రైనాను రామలక్ష్మణుడిగా పిలుచుకుంటారు అభిమానులు. అలాంటి వీరిద్దరు ఓకే రోజు.. నిమిషాల వ్యవధిలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

ధోనీ నీతో కలిసి క్రికెట్ ఆడడం మధురానుభూతి. ఈ ప్రయాణంలో నేనూ నీతో చేరాలని నిర్ణయించుకున్నా. జైహింద్.
సురేష్ రైనా



సురేష్ రైనా ఇప్పటి వరకు 226 వన్డేలు, 19 టెస్ట్‌లు, 78 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో 5,615 పరుగులు చేశాడు రైనా. టెస్టుల్లో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలతో 768 పరుగులు పూర్తి చేశాడు. ఇక టీ20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో 1,605 పరుగులు చేశాడు. రైనా టీమిండియా జట్టులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా వేసి అన్ని విభాగాల్లోనూ రాణించాడు.

2018, జులై 8న ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టీట్వంటీయే సురేష్ రైనాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఏ మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. సురేష్ రైనా 2005, జులై 30న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టులో అరంగ్రేటం చేశాడు. 2006 ట్వీ20 జట్టులో, 2010లో టెస్ట్ జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లోనూ ఎన్నో రికార్డు సాధించాడు రైనా. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రైనా రెండో స్థానంలో ఉన్నాడు. 5412 పరుగులతో కొహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. 5368 పరుగులతో సెకండ్ ప్లేస్ సాధించాడు రైనా. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతాడు.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading