ఐపీఎల్ 2020

  • associate partner

యుఏఈలో అడుగుపెట్టిన సొట్టబుగ్గల సుందరి.. రావడం.. రావడంతోనే..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ప్రస్తుతం యుఎఇలో ఉన్నారు, ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్న ఆమె జట్టుకు ఓ వీడియో సందేశాన్ని పంపారు.


Updated: September 17, 2020, 1:37 PM IST
యుఏఈలో అడుగుపెట్టిన సొట్టబుగ్గల సుందరి.. రావడం.. రావడంతోనే..
punjab team
  • Share this:
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆటగాళ్ల అందరూ సన్నాహాలలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయం ఐపీఎల్ జట్లకు చాలా సవాలతో కూడుకున్నది. భారత్ కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నందున, ఈసారి యుఎఇలో ఐపీఎల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బయో-సెక్యూరిటీ బబుల్‌లో ఉండటమే కాకుండా, ఆటగాళ్లకు యుఎఇ పరిస్థితులకు అలవాటు పడడం అంత సులభం కాదు. అక్కడి వాతావరణ పరిస్ధితులకు అలవాటు పడేలా ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ళ కావాల్సిన ఏర్పాట్లను చేశాయి. టీం యాజమాన్యలు దగ్గరగా ఉండి ఫ్లేయర్స్ బాగోగులు చూసుకుంటున్నాయి.


View this post on Instagram

Preity woman da special message for #SaddaSquad 🥰 Hit it! ▶️ #SaddaPunjab #Dream11IPL


A post shared by Kings XI Punjab (@kxipofficial) on


ఇందులో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ప్రస్తుతం యుఎఇలో ఉన్నారు, ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్న ఆమె జట్టుకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఆ వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బృందం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేరు చేసింది. "హాయ్ టీం.. మీరందరూ చాలా ఫీట్‌గా కనిపిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సందేశాలను చూస్తునే ఉన్నా.. ఇప్పుడు నేను స్వీయ నిర్భందంలో ఉన్న త్వరలోనే నేను కూడా బయో బబుల్‌లోకి అడుగుపెడుతానని" తెలిసారు

ఐపీఎల్ వీక్షించడం కోసం యుఏఈ వెళ్ళిన ప్రీతి జింటా ఐసీసీ నిబంధనల ప్రకారం క్వారెంటైన్‌లో ఉన్నారు. వారంలో తర్వాత ఆమె జట్టుతో కలవనున్నారు. ఐపీఎల్ రాగానే ఈ బాలీవుడ్ భామా సందడి కూడా మెుదలవుతుంది. ప్లై కిసింగ్‌లతో,డాన్స్‌ చేస్తూ పంజాబ్ ఆటగాళ్ళును పోత్సాహిస్తునే ఉంటుంది. తాజాగా ఆమె వీడియోను ఇన్‌స్ట్రాలో షేరు చేసిన పంజాబ్ టీం "ప్రెట్టీ ది ఉమెన్ జట్టుకు ప్రత్యేక సందేశం పంపారు" క్యాప్షన్‌తో ఆ వీడియోను జత చేశారు.
Published by: Rekulapally Saichand
First published: September 17, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading