• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • CRICKET DREAM11 IPL 2020 FINAL MI VS DC ALL YOU NEED TO KNOW AS DELHI CAPTIALS INDIANS CAPITALS LIVE STREAMING PRIZE MONEY SCHEDULE TIMING SA

IPL 2020: సెహ్వాగ్‌తో కానిది ‌శ్రేయస్‌ అయ్యార్‌‌తో అవుతుందా!.. ఫ్యాన్స్‌లో అత్రుత

IPL 2020: సెహ్వాగ్‌తో కానిది ‌శ్రేయస్‌ అయ్యార్‌‌తో అవుతుందా!.. ఫ్యాన్స్‌లో అత్రుత

Delhi Capitals vs

ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ టైటిల్ గెలవాలనేది ఆ జట్టు చిరకాల కోరిక... ఐపీఎల్ ఆరంభం నుంచి కప్ గెలవాలని ఆశగా ఎదురుచూస్తున్న ఆ జట్టు కల కల్లగానే మిగిలిపోతుంది.

  • Share this:
    ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ టైటిల్ గెలవాలనేది ఆ జట్టు చిరకాల కోరిక... ఐపీఎల్ ఆరంభం నుంచి కప్ గెలవాలని ఆశగా ఎదురుచూస్తున్న ఆ జట్టు కల కల్లగానే మిగిలిపోతుంది. ఎలాగో..అలాగో ఈ ఐపీఎల్‌లో ఫైనల్ చేరిన ఢిల్లీ ఈ సారైనా కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆరంభంలో వరుస విజయాలతో ఆదరగొట్టిన క్యాపిటల్స్ లీగ్ చివరిలో మాత్రం  తడబడింది. చివరగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓటములను చవిచూసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది.
    బ్యాట్స్‌మెన్ పేలవ ఆటతీరు కారణంగా జట్టు ఓటిమిపాలైంది. కానీ చావో రేవో తెల్చుకోవాల్పిన మ్యాచ్‌లో ఊహించని విధంగా మెరుపు దాడి చేసి గెలిచేసింది!

    వరుస విజయాలతో దూసుకపోతున్న సన్‌రైజర్స్‌‌కు ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌ గెలుస్తుందని అందరూ ఆశించనప్పటికి.. అంచనాలన్ని తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. చివరకు ఫైనల్లో అడుగుపెట్టి.. మంగళవారం ముంబైని ఢికొట్టాడనికి సిద్దమవుతుంది. తన సుదీర్ఘ నిరీక్షణను ఫలించేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఢిల్లీ మినహా అన్ని ఫ్రాంఛైజీలు కప్ గెలవకపోయిన కనీసం ఫైనల్ వరకైన చేరాయి. తొలిసారి ఐపీఎల్‌లో చరిత్రలో దిల్లీ ఫైనల్‌ చేరింది.

    ఇక చివరిపోరులో ముంబైతో తలపడనుంది. అందులో గెలిచి తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఎదురుచూస్తుంది. అయితే ముంబై లాంటి బలమైన జట్టుపై గెలవడం అంతా సులువైన పని కాదు. క్వాలిఫయన్ -1‌లో ఢిల్లీని.. రోహిత్ సేన ఎంత చిత్తుగా ఓడించిందో చూశాం. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన  క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ మొదలు పెట్టగానే కుదేలైంది. ఢిల్లీ 41 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి ఢిలా పడింది. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది.

    క్వాలిఫయర్‌1లో ముంబై పంజాకు ఆదిరిపోయిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ముంబైని ఎలా ఎదురుస్తోందో చూడాలి. సన్‌రైజర్స్‌పై గెలిచిన స్పూర్తితో ఫైనల్లో కూడా గెలిచి తొలిసారి టైటిల్ ఎగురేసుకుపోవాలని చూస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు