IPL2020: మూడు ఫ్రాంఛైజీలకు షాక్ .. ఆ జట్ల నుంచి ముగ్గురు ప్లేయర్ ఔట్

ఇనాళ్ళు బీసీసీఐని వెంటాడిన కష్టాలు ఇప్పుడు ప్రాంఛైజీలను వెంటాడుతున్నాయి. టోర్నీ దగ్గర పడుతున్న సమయంలో మూడు ప్రాంఛైజీలకు ఊహించని షాక్ తగిలింది.

Rekulapally Saichand
Updated: August 7, 2020, 4:30 PM IST
IPL2020: మూడు ఫ్రాంఛైజీలకు షాక్ .. ఆ జట్ల నుంచి ముగ్గురు ప్లేయర్ ఔట్
sunrisers hyderabad
  • Share this:


ఇనాళ్ళు బీసీసీఐని వెంటాడిన కష్టాలు ఇప్పుడు ప్రాంఛైజీలను వెంటాడుతున్నాయి. టోర్నీ దగ్గర పడుతున్న సమయంలో మూడు ప్రాంఛైజీలకు ఊహించని షాక్ తగిలింది. కరోనా కారణంగా ఆటగాళ్ళ శేయస్సును దృష్టిలో పెట్టుకుని బోర్డు స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించింది. వీటిలో ముఖ్యమైనది ప్రతి జట్టులో 24 మంది ఆటగాళ్ళు ఉండాలని సూచించింది.

అయితే ఇది టోర్నీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎదురుదెబ్బే అని చెప్పోచ్చు. ఈ మూడు జట్లు 25 మంది ఆటగాళ్ళను కలిగి ఉన్నాయి. దీంతో జట్ల నుంచి ఒక్కరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు నియమాలను ప్రాంఛైజీలు తప్పక పాటించాల్సిన పరిస్ధితులు కలగడంతో చిన్న స్ధాయి క్రికెటర్లపై వెటు పడే అవకాశం ఉంది.

అలాగే ఫ్రాంఛైజీలు ఆగస్టు 20 తర్వాతే తమ జట్లను యూఏఈకి పంపాలని సూచించింది. రిసార్ట్స్ లేదా స్టార్ హోటళ్ళలలో విడిది ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్ళడంపై క్రికెటర్ల ఇష్టానికే వదిలేసింది. వైరస్ విజృంభణ కారణంగా ఐపీఎల్ 2020ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. దీని కోసం బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఆటగాళ్ళు అందరూ తప్పనిసరిగా బబుల్ రూల్స్‌ని ఫాలో అవ్వాలని బీసీసీఐ తెలిపింది.
Published by: Rekulapally Saichand
First published: August 7, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading