CONSPIRACY THEORIES DOING ROUNDS AS KIERON POLLARD SHARES CRYPTIC POST AFTER MUMBAI INDIANS SA
పొలార్డ్.. ఢిల్లీతో జరిగే మ్యాచ్ ఆడకు.. అప్పుడే నీ విలువ రోహిత్‌కు తెలుస్తుంది
Pollard and Pandya
కీరన్ పొలార్డ్ తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఒక ఆసక్తికర పోస్ట్‌ను పెట్టాడు. " స్నేహం ముసుగులో నమ్మించి మోసం చేసేవాడికంటే.. నేను మిత్రుని భావించేవారు నన్ను ఎక్కువ ద్వేషిస్తున్నారు" అంటూ పోస్ట్ చేశాడు.
ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కోపం వచ్చినట్టుంది. ఈ కోపం ఎవరిపై అనేది మాత్రం తెలియలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో లీగ్ చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన విషయం తేలిసిందే. ఈ పోరులో సన్‌రైజర్స్ ముంబైపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం కీరన్ పొలార్డ్ తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఒక ఆసక్తికర పోస్ట్‌ను పెట్టాడు. " స్నేహం ముసుగులో నమ్మించి మోసం చేసేవాడికంటే.. నేను మిత్రుని భావించేవారు నన్ను ఎక్కువ ద్వేషిస్తున్నారు" అంటూ పోస్ట్ చేశాడు.
తనను ఇంతగా బాధించిన వారు ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు. ఇది వెస్టిండిస్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి చేసిన వాఖ్యగా తెలుస్తోంది. తాజాగా ఎంపిక చేసిన వన్డే జట్టులో పొలార్డ్ స్థానంలో జాసన్ హోల్డర్‌ను తీసుకున్నారు. బోర్డులోని కొందరు సభ్యులు తనపై పక్షపాతం చూపిస్తున్నారని పరోక్షంగా పోలార్డ్ కామెంట్ చేశారని తెలుస్తోంది. ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ తొడ కండరాల నోప్పి కారణంగా కొన్ని దూరమైన విషయం తెలిసిందే! ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఆ మ్యాచ్‌లో పొలార్డ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే పోలార్డ్ అలాంటి కామెంట్ చేయడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మే కారణమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. " పోలార్డ్ విలువ ఏంటో ముంబై ఇండియన్స్ గుర్తించడం లేదు. నువ్వు ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరికి ఎక్కడ చెడిందో మాత్రం అర్థం కావడం లేదు. మరికొందరు మాత్రం పొలార్డ్ అవేదన వెనుక జాసన్ హోల్డర్ ఉన్నాడని అంటున్నారు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.