ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఏంటన్నయ్య ఇలా చేశారు.. అందరూ చెన్నై గోవింద గోవింద అంటున్నారు

. సీఎస్‌కే ఫ్యాన్ అయిన ఆ పిల్లాడు.. ఏడుస్తూ చెన్నై ఆట తీరును విమర్శస్తూ.. మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుందో

news18-telugu
Updated: October 22, 2020, 9:42 PM IST
IPL 2020: ఏంటన్నయ్య ఇలా చేశారు.. అందరూ చెన్నై గోవింద గోవింద అంటున్నారు
. సీఎస్‌కే ఫ్యాన్ అయిన ఆ పిల్లాడు.. ఏడుస్తూ చెన్నై ఆట తీరును విమర్శస్తూ.. మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుందో
  • Share this:
ఐపీఎల్.. క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్ళిన సూపర్ లీగ్.. ఈ సీజన్ వచ్చిందంటే అభిమానులకు పండుగే.. బ్యాటింగ్ మెరుపులు,ఫీల్డిండ్ విన్యాసాలు. ఆదిరేపోయే బౌలింగ్ అన్ని ఫ్యాన్స్‌ను మైమరిపింపజేస్తాయి. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితిలలో కూడా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ తలచిదంటే.. ఈ టోర్నకి ఉన్న క్రేజి ఏంటో ఆర్ధమవుతుంది. తన అభిమాన జట్టు ఆడే మ్యాచ్‌లను చూడాలని.. ఆ టీం ఆటగాళ్ళ మెరుపులను అస్వాధించాలని ప్రతి అభిమాని ఆశ. ఇక ధోనీ సారధ్యంలోనే చెన్నై లాంటి టీంలపై అయితే మాత్రం ఫ్యాన్స్‌ ఆశలు మరి ఎక్కువ. కానీ అయితే అది మరి ఎక్కువ.

తాజాగా ఓ బుడ్డోడు ఆవేదనలో ఇది కనబడింది. సీఎస్‌కే ఫ్యాన్ అయిన ఆ పిల్లాడు.. ఏడుస్తూ చెన్నై ఆట తీరును విమర్శస్తూ.. మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుందో. " మీకేం తెలుస్తాది అన్నయ్యా.. మీరు ఎక్కడో ఉంటారు. మీరు ఇంటి వెళ్ళిపోయారు. మాకు ఏం తెలుస్తాది అన్నయా.. వీళ్ళందరూ చెన్నై ఇంటికి వెళ్ళిపోయిందంటున్నారు. ఒక్కరు ఏమో ధోని , వాట్సన్‌, బ్రావోలకు దండలు వేసి గోవిందా అంటూ పాట పాడాడు అన్నయా.. అన్నా ధోనీ అన్నయా ఏం చేయాలన్నా" అంటూ తన వేధనను వెల్లబోసుకున్నాడు.


చెన్నై ఆట తీరు అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. తమ అభిమాన టీం ఆటను చూసి ఇతర జట్ల ఫ్యాన్స్ ముందు తల దించుకోవాల్పి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉంది. ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. పాయిట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఎప్పుడూ లేనంతగా దారుణ పరిస్థితుల్లో ఉంది చెన్నై జట్టు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీతో పాటు తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: October 22, 2020, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading