ఐపీఎల్ 2020

  • associate partner

ఆ ఇద్దరూ ఓకే అంటేనే ఐపీఎల్‌లో రైనా రీఎంట్రి!

సెప్టెంబర్19న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం దుబాయ్‌ చేరుకున్న సీఎస్‌కే జట్టు వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది. అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పేసర్‌ దీపక్‌ చాహర్, బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మందికి కొవిడ్‌-19 సోకింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.


Updated: September 4, 2020, 10:22 AM IST
ఆ ఇద్దరూ ఓకే అంటేనే ఐపీఎల్‌లో రైనా రీఎంట్రి!
సెప్టెంబర్19న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం దుబాయ్‌ చేరుకున్న సీఎస్‌కే జట్టు వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది. అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పేసర్‌ దీపక్‌ చాహర్, బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మందికి కొవిడ్‌-19 సోకింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.
  • Share this:
ఐపీఎల్ నుంచి రైనా ఆకస్మక నిష్ర్కరమణపై సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర ఆగ్రహాంతో ఉంది. టోర్నీ నుంచి అతను తప్పుకోవడాన్ని  ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. రైనాపై తీవ్ర ఆసహనంతో ఉన్న చెన్నై ఫ్రాంచైజీ అతను చర్యలు ఉపక్రమించింది. సీఎస్‌కే యాజమాని  శ్రీనివాసన్‌ ఇప్పటికే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తేలిసిందే. తాజాగా అతని సంబంధించిన మరో విషయం వెలుగులోకి

వచ్చింది. రైనా దుబాయ్‌ నుంచి స్వదేశానికి చేరుకొగానే సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆయనను తొలగించారని సమాచారం.

సెప్టెంబర్19న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం దుబాయ్‌ చేరుకున్న సీఎస్‌కే జట్టు వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది.  అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పేసర్‌ దీపక్‌ చాహర్, బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మందికి కొవిడ్‌-19  సోకింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సురేశ్‌ రైనా ఈ ఐపీఎల్‌ నుంచి వైదోలగడం. గడవులోపు టీంతో కలవాల్సిన హర్భజన్ సింగ్ దుబాయ్‌కి చేరుకోకపోవడంతో పరిస్ధితులు గందగోళంగా మారాయి.

రూమ్ విషయంలో సీఎస్‌కే యాజమాన్యంపై తీరుపై ఆసంతృప్తి చెంది,జట్టులో కరోనా కేసులు బయటపడడం చూసి అతను ఐపీఎల్  నుంచి తప్పుకున్నడనే వార్తలు వచ్చాయి. అలాగే రైనా తీరుపై చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ విరుచుకుపడ్డారు.  ‘విజయగర్వం తలకెక్కితే ఇలాగే ఉంటుంది" అంటూ అసహపం వ్యక్తం చేశారు. జట్టులో గందరగోళ పరిస్ధితులు ఏర్పాడినప్పుడు  సీనియర్ ఆటగాడిగా ఇతర ప్లేయర్స్‌కు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిందిపోయి తను తప్పకుంటాడా అని అభిమానులు కూడా రైనాపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తనపై ఉన్న ఆగ్రహాన్ని రైనా చల్లారిచ్చే ప్రయత్నం చేశారు. "శ్రీని నన్ను చిన్న కొడుకులా చూసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇండియా తిరిగి వచ్చాను. మళ్ళి ఐపీఎల్ ఆడిన ఎవరూ అశ్చర్యం లేదంటూ" అని అన్నారు.ప్రస్తుతం రైనా మళ్ళి ఐపీఎల్‌ల్లోకి  తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని  ధోనీ , జట్టు మేనెజర్ విశ్వనాథ్ చేతిలో పెట్టారు శ్రీనివాపన్.  అయితే అతనిపై సీఎస్‌కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Published by: Rekulapally Saichand
First published: September 4, 2020, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading