ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్

ఎట్టికేలకు చెన్నై టీంలో మైదానంలో దిగింది.శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మెుదలు పెట్టింది.ఈ విషయాన్ని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రాకీస్‌కి దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మినహా ఆటగాళ్లందరూ గ్రౌండ్‌లో సాధన మెుదలుపెట్టారు.


Updated: September 4, 2020, 6:50 PM IST
IPL 2020: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్
సీఎస్‌కే టీమ్
  • Share this:
ఎట్టికేలకు చెన్నై టీంలో మైదానంలో దిగింది.శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మెుదలు పెట్టింది.ఈ విషయాన్ని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రాకీస్‌కి దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మినహా ఆటగాళ్లందరూ గ్రౌండ్‌లో సాధన మెుదలుపెట్టారు. వీరిద్దరికి కరోనా  సోకిన విషయం తేలిసిందే. దీంతో వారిని క్వరంటైనికే పరిమితం చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చినప్పటికీ.. 4 రోజుల క్వారంటైన్‌ సమయం పూర్తి చేసుకున్నాకా.. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే వారిని ప్రాక్టీస్‌కు అనుమతి ఇస్తారు.

ప్రస్తుతం అన్ని టీమ్స్ ప్రాక్టీస్ మెుదలుపెట్టాయి.ఇటీవలే సీఎస్‌కే టీంలో కరోనా కేసులు బయటపడడంతో ఆ జట్టు శిక్షణ శిబిరం అలస్యంగా మెుదలైంది. టీంలోని 13 మందికి కరోనా సోకిన విషయం తేలిసిందే. వారిలో ఇద్దరూ ఆటగాళ్ళు ఉండడంతో జట్టు మెుత్తాన్ని కొద్ది రోజుల పాటు క్వరంటైన్‌లో ఉంచారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆగస్టు 21న ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వెళ్లింది. నిబందనల ప్రకారం జట్టు స్వీయ నిర్భంధంలో ఉంది. వారం రోజుల తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో జట్టులో తీవ్ర గందరగోళం మెుదలైంది. ఆ తర్వాత పరిణామాలు చకచక జరిగిపోయాయి. రైనా లాంటి స్టార్ ఆటగాడు టోర్నీ నుంచి తప్పుకోవడం, హర్భజన్ సింగ్ లాంటి వెటరన్ స్పీన్నర్ ఐపీఎల్ 2020 ఆడానని తాజాగా ప్రకటించడంతో అభిమానులు కొంత అయోమయానికి గురైయ్యారు, అయితే పరిస్ధితులు మెల్లగా..మెల్గగా మెరుగుపడుతున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: September 4, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading