ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇంటి దారి పట్టింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆరంభంలో ఫేలవ న్రదర్శనతో పట్టికలో చివరి స్థానంలో నిలిచిన కింగ్స్.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా ఐదు విజయాలను సాధించింది. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గెల్ వచ్చిన వేళ విశేషం ఏమో కానీ వరుసగా గెలుస్తూ ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తూ వచ్చింది. కానీ చివరిగా ఆ జట్టు ఆశలను చెన్నై దెబ్బతీసింది. అయితే పంజాబ్ ఓడిన గెలిచిన సెంటర్ ఆప్ అట్రాక్షన్ నిలిచేది మాత్రం నటీ , ఆ జట్టు సహ యాజామని ప్రీతి జింటానే... ఇక ఆమెను టార్గెట్‌గా చేసుకుని నెటిజన్స్ జోకులు పేల్చుతున్నారు.
Urko Baby Urko.... pic.twitter.com/rIxdoVMOFf
— A n v e s h 😉 - Definitely Not ✌🏻 ! (@AnveshTarak999) November 1, 2020
Love you & always with you 💔♥️ pic.twitter.com/uSNAjiWKhW
— 💙be_Cool_pradhap🌠💙 (@pradhaparav) November 1, 2020
ఏళ్ళ నుంచి వేచి చూస్తున్న సొట్ట బుగ్గల సుందరి.. టైటిల్ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతుందంటూ నెటిజన్స్ జింటాపై సెటైర్స్ వెస్తున్నారు. ఆమెకు
12 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ధ్రాక్షగానే మిగిలిపోయింది. ఎవరూ వచ్చిన ఆ జట్టు తలరాతను మార్చలేకపోతున్నారని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ‘ఫ్లైయింగి కిస్స్‌లు మిస్సయ్యే' పాపం ప్రీతి జింటా అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయిపాయే.. పంజాబ్‌ను చెన్నై అస్సాం తీసుకుపాయే.. ఆశల గల్లంతాయంటూ స్టాడింగ్ కామెడి చేస్తున్నారు.
KXIP: We will qualify today.
CSK:#CSKvKXIP pic.twitter.com/KbDwwT4mIk
— MeMe izz LuB (@MeMeIzzLuB) November 1, 2020
#csk to #KXIP rn: 😭😹 pic.twitter.com/JqpcOPzFDz
— Vishal (@vishal_saini_vs) November 1, 2020
ఇక పంజాబ్‌కు లక్కు కూడా ఫేవర్ చేయలేదు. మూడు మ్యాచ్‌ల్లో విజయం అంచుల వరకు వెళ్ళి తృటిలో గెలుచే మ్యాచ్‌లను చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మెుదటి మ్యాచ్‌లో అంపైర్ షార్ట్ రన్‌గా ఇవ్వడం.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు సిక్స్ వరకు వెళ్ళిన బంతి కాస్త బౌండరీగా మారడం ఆ జట్టు కొంప ముంచాయి. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తెవాటీయా వరుసగా సిక్స్ కొట్టడంతో పంజాబ్ గెలిచే మ్యాచ్ కాస్త ఓడిపోయింది. దీంతో పంజాబ్ అభిమానులు ఈ విషయాలను సోషల్ మీడియాలో షేరు చేస్తూ.. మా జట్టు లక్ కూడా ఫేవర్ చేయలేదంటూ బాధపడుతున్నారు.
CSK Carrying KXIP To The Airport With Them : pic.twitter.com/xD8K3XYFIL
— The Sensible Critic (@CriticSensible) November 1, 2020
ఇక చెన్నైతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ బొక్కబోర్లాపడింది. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లోనూ విఫలమై.. కీలక మ్యాచ్‌లో ఓటమి పాలయింది. చెన్నై జట్టు ఇంటికి వెళ్తూ.. వెళ్తూ.. పంజాబ్‌ను కూడా పట్టుకెళ్లిపోతోంది. పంజాబ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ చేధించారు. 18.5 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి విజయ తీరాలకు చేర్చారు. యంగ్ గన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.