IPL 2020:csk vs rr: ధోనీని ఊరిస్తోన్న మూడు రికార్డులు.. మహీ ఆట కోసం ఫ్యాన్స్‌లో ఆత్రుత

ఐపీఎల్ 13 ఎడిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో ఎంటర్ టైన్ చేశాయి. అలాగే మంగళవారం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ 13 ఎడిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో ఎంటర్ టైన్ చేశాయి. అలాగే మంగళవారం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    ఐపీఎల్ 13 ఎడిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో ఎంటర్ టైన్ చేశాయి. అలాగే మంగళవారం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020లో నాల్గవ మ్యాచ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)‌ మధ్య జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో గెలుపుపై కన్నేసింది.

    టోర్నీ ముందు జట్టులో కొన్ని అనుహ్య పరిణామాల చోటుచేసుకున్నప్పటికి చెన్నై ఆటగాళ్ళలలో ఆత్మస్థైర్యాన్ని నింపారు ఎంఎస్ ధోనీ. తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన నాయకత్వ చతురతో జట్టును విజయాల తీరాలకు చేర్చాడు.

    మంగళవారం జరిగే మ్యాచ్‌లో ధోనీని ఓ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో మరో ఐదు సిక్స్‌లు కొడితే మహీ 300 సిక్సర్ల మార్కులో చేరుతాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ (361 సిక్సులు), సురేశ్ రైనా (311 సిక్సులు) మాత్రమే 300 300 సిక్సర్ల మార్కులో ఉన్నారు. ప్రస్తుతం 295 సిక్స్‌లతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు.అలాగే మరో రెండు రికార్డులు కూడా ధోనీని ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 100 వంద క్యాచ్‌లు పట్టిన ధోనీ మరో 3 క్యాచ్‌లు అందుకుంటే సురేశ్ రైనా (102) రికార్డును అధిగమిస్తాడు. అలాగే 191 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ.4432 పరుగులు చేశాడు. వాటిలో 23 హాఫ్ సెంచరీలు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ మ్యాచ్‌లో చేలరేగితే తన అత్యధిక స్కోరును దాటే అవకాశం ఉంది.
    Published by:Rekulapally Saichand
    First published: